బ్యాడ్ కొలస్ట్రాల్ తగ్గించుకున్నంత మాత్రానా గుండె జబ్బులు తగ్గవు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శరీరంలో అవసరంలేని కొవ్వు చేరితే.. అనారోగ్య సమస్యలకు దారితీస్తుదంటారు. చెడు కొలస్ట్రాల్ అత్యంత ప్రమాదకరం.. ఎక్కువ స్థాయిలో కొవ్వు పెరిగిపోతే గుండె సంబంధత సమస్యలు వస్తాయని పలు పరిశోధనలు సూచించాయి. ఇప్పుడు ఓ కొత్త అధ్యయనం ప్రకారం.. గుండె జబ్బులను నివారించాలంటే.. చెడు కొలస్ట్రాల్ స్థాయిలు తగ్గితే సరిపోదని అంటున్నారు .చెడు కొవ్వును కరిగించినంత మాత్రానా గుండె జబ్బులను తగ్గించలేదని అంటోంది. దశాబ్దాల పరిశోధనల్లో చెడు కొవ్వును తగ్గించుకుంటే హృదోగ రోగాలు శాశ్వతంగా రావని నిరూపించలేకపోయాయి. న్యూ మెక్సికో యూనివర్శిటీలోని ఒక బృందం ఈ పరిశోధన నిర్వహించింది. క్లినికల్ మార్గదర్శకాలకు అనుగుణంగా కొలెస్ట్రాల్ తగ్గించే మందులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి అందుబాటులోకి వచ్చాయి.

గుండె ఆరోగ్యం సరిగా లేనివారిలో 190 mg/dl.. అంతకంటే ఎక్కువ LDL కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారిలోనూ గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అదే డయాబెటిస్ ఉన్న పెద్దల్లో వయస్సు, కుటుంబ చరిత్ర వంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రకమైన గుండె జబ్బులు 10 ఏళ్లలో 7.5 శాతం లేదా అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందని, భవిష్యత్తులోనూ వీరికి గుండె జబ్బుల ప్రమాదం అత్యధికంగా ఉంటుందని చెబుతున్నారు.వయస్సు, కుటుంబ చరిత్ర వంటి వివిధ సహాయక కారకాల ఆధారంగా వచ్చే 10 సంవత్సరాలలో 7.5% లేదా అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం అనేది సరైన విధానమే కాదని LDL అధ్యయనంలో పరిశోధక బృందం అభిప్రాయపడుతున్నారు.

మూడు రకాల కొలెస్ట్రాల్-తగ్గించే ఔషధాలలో (statins, ezetimibe, PCSK9) సాధారణ సంరక్షణ లేదా డమ్మీ డ్రగ్స్ (placebo)తో కనీసం ఒక ఏడాది పాటు చికిత్సను పోల్చి చూశారు.. ఈ పరిశోధక బృందం అన్ని క్లినికల్ అధ్యయనాలను సమీక్షించింది. ఇందుకోసం 35 ట్రయల్స్‌ నిర్వహించింది. గుండెపోటు / స్ట్రోక్, లేదా మరణం వంటి ముప్పును నివారించే ఫలితాలను నివేదించింది.విశ్లేషణ ప్రకారం.. అన్ని పరీక్షలలో మూడొంతుల మంది మరణించే ప్రమాదం ఉందని తేలలేదు. దాదాపు సగం మంది భవిష్యత్తులో గుండె జబ్బుల ప్రమాదం తగ్గినట్టు చూపించలేదు. క్లినికల్ ట్రయల్స్‌లో 13 LDL కొలెస్ట్రాల్ తగ్గింపు లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఒకటి మాత్రమే మరణించే ప్రమాదం ఉందని తేల్చింది. LDL కొవ్వును తగ్గించడంలో 22 ప్రయత్నాలలో, 4 మరణ ప్రమాదంపై ఆశించిన స్థాయిలో ఫలితాలను వెల్లడించింది. ఇందులో 14 గుండె జబ్బులకు సంబంధించి ముప్పును తగ్గించినట్లు నివేదించింది.

READ  పోర్న్ ఎక్కువగా చూసే మగాళ్లలో అంగస్థంభన సమస్య తీవ్రమవుతుంది...లేటెస్ట్ స్టడీ

గుండె జబ్బులతో తక్కువ ప్రమాదం ఉన్న వ్యక్తులలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను అనవసరమైన చికిత్సను నివారించాల్సిందిగా పరిశోధక బృందం సూచించింది. రోగులలో అత్యధిక ప్రమాదంలో నివారించాలని బృందం పేర్కొంది. దురదృష్టవశాత్తు.. రిస్క్-గైడెడ్ మోడల్ ఈ లక్ష్యాలను సాధించడంలో విఫలమైందనే చెప్పాలి. గుండె జబ్బుల అభివృద్ధికి LDL కొలెస్ట్రాల్ అవసరమని అంటున్నారు.

Related Posts