లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

క్యాన్‌లో పెట్రోల్ నింపలేదన్న కోపంతో ఓనర్‌పైకి విషపూరిత పాముని విసిరాడు

Published

on

refused-fuel-in-can-man-throws-live-snake-in-pump-owners-cabin-in-mumbai-1

మంబైలో దారుణం జరిగింది. క్యాన్ లో పెట్రోల్ నింపలేదన్న కోపంతో ఓ వ్యక్తి చేసిన పని సంచలనంగా మారింది. క్యాన్ లో పెట్రోల్ నింపేది లేదని బంకు సిబ్బంది చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి, బతికున్న విషపూరిత పాముని తీసుకొచ్చి బంకు మహిళా యజమాని రూమ్ లోకి వదిలాడు. దీంతో ఆ మహిళ బిత్తరపోయింది. భయంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. మల్కాపూర్ రోడ్డులోని చౌదరీ పెట్రల్ బంక్‌లో ఈ ఘటన జరిగింది.

డబ్బాలో విషపూరిత పాము తెచ్చి ఓనర్ కేబిన్‌లో వదిలాడు:
బంకు సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి కాల్ చేశారు. అతడు వచ్చి పాముని పట్టుకున్నాడు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, పాము విసిరిన వ్యక్తి కూడా పాములు పట్టే వాడేనని పోలీసులు తేల్చారు. బంకు సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఓ డబ్బాలో పాముని తీసుకొచ్చిన ఆ వ్యక్తి, దాన్ని ఓనర్ కేబిన్ లోకి వదిలిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్ వీడియోలో వైరల్ అయ్యింది.

మరీ అంత కోపమా? పెట్రోల్ పోయకపోతే చంపేస్తారా?
తాము నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించామని, బాటిల్ లో కానీ డ్రమ్ లో కానీ పెట్రోల్ నింపొద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని బంకు సిబ్బంది తెలిపారు. ఇదే విషయాన్ని ఆ వ్యక్తికి చెబితే అతడు కోపంతో ఊగిపోయాడని వాపోయారు. ఈ ఘటనతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరక్కపోవడంతో అంతా రిలాక్స్ అయ్యారు. బంకు సిబ్బంది రూల్స్ ప్రకారమే వ్యవహరించారని, అందులో వారి తప్పు లేదని నెటిజన్లు అంటున్నారు. ఇంత మాత్రానికే అంత కోపమా? ఇది టూ మచ్, అని ఆ వ్యక్తిపై నెటిజన్లు మండిపడుతున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి వెధవ పనులు చేయకుండా పాముని విసిరిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బంకు సిబ్బంది, స్థానికులు పోలీసులను కోరారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *