ఫ్యూచర్ బ్రాండ్ లో RIL కు రెండో ర్యాంకు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని Reliance Industries Limited (RIL) ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్రాండ్ గా అవతరించింది. ఫ్యూచర్ బ్రాండ్ రూపొందించిన జాబితాలో యాపిల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా..ఆర్ఐఎల్ రెండో ర్యాంకు పొందింది. ఆర్ఐఎల్ అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించిందని, నైతిక విలువలు పాటిస్తూ…దూసుకెళుతోందని వెల్లడించింది.వినూత్న ఉత్పత్తులు, వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందిస్తోందని, వినియోగదారులకు విడదీయరాని అనుబంధం ఉందని ఫ్యూచర్ తెలిపింది. వినియోగదారుల అవసరాలను తీర్చే ఓ దిగ్గజ డిజిటల్ సంస్థను ఆర్ఐఎల్ ఛైర్మన్ తీర్చిదిద్దారని కొనియాడింది.

ఇంధనం, పెట్రో రసాయనాలు, జౌళి, సహజ వనరులు, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, ఎన్నో రంగాల్లో అడుగుపెట్టింది. ఇప్పుడు ఫేస్ బుక్, గూగుల్ లాంటి సంస్థలు ఇందులో వాటాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యూచర్ బ్రాండ్ విడుదల చేసిన జాబితాలో మూడోస్థానంలో శామ్ సంగ్ నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎన్ విడియా, మౌటాయ్, నైక్, మైక్రోసాఫ్ట్, ఏఎస్ఎమ్ఎల్, పేపాల్, నెట్ ఫ్లిక్స్ లు చోటు సంపాదించాయి. ఈ ఏడాది మొత్తంగా 15 కంపెనీలు కొత్తగా స్థానం సంపాదించాయి.

Related Posts