లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

ఇండియాలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కలగలిపినా ఒక్క అంబానీకి సాటిరారు

Published

on

reliance-industries-scales-market-capitalisation-of-rs-16-lakh-crore-for-first-time1

ఓ కంపెనీ వేల్యూ ఎంత ఉంటుంది..పది వేల కోట్లు.. లక్ష కోట్లు..కానీ అదే కంపెనీ ఏకంగా 15 లక్షలకోట్ల మార్కెట్ వేల్యూ దాటిపోతే..అది కచ్చితంగా ముకేశ్ అంబానీదే అయి ఉంటుంది..అతిశయోక్తిగా ఉన్నా..స్టాక్‌మార్కెట్‌లో ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు చూస్తే ఇలానే ఉంది..వరసగా ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తూ..భారత కార్పొరేట్ కంపెనీల సత్తాను చాటుతోన్న ఫస్ట్ ఇండియన్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేస్తే..ఇప్పుడు మార్కెట్ కేపిటలైజేషన్ పరంగా 15లక్షల30వేల కోట్లను దాటేసి…ప్రత్యర్థి కంపెనీలకు అందనంత ఎత్తులో చేరింది రిలయన్స్..

దేశంలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థల మార్కెట్ కేపిటలైజేషన్‌ కంటే ఎక్కువ:
గత రెండు నెలల్లోనే రిలయన్స్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాంలో ఫేస్‌బుక్, గూగుల్, సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టాయి. దీంతో స్టాక్స్ ధరలు ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్నాయ్.

దీంతో స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్క కంపెనీ మార్కెట్ వేల్యూనే…దేశంలోని ఇతర ప్రభుత్వరంగ సంస్థల మార్కెట్ కేపిటలైజేషన్‌ కంటే ఎక్కువగా నమోదైంది.. అంటే..దేశంలో లిస్ట్ అయిన ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ వేల్యూ అన్నీ కలిపినా కూడా ముకేశ్ అంబానీ ఒక్క రిలయన్స్‌తో సమానం కాదన్నమాట.

Reliance Retail వెంచర్స్ లో Silver Lake పెట్టుబడులు


6 నెలల కాలంలో…15.7శాతం పెరిగిన రిలయన్స్ మార్కెట్ వేల్యూ:
రిలయన్స్ మార్కెట్ వేల్యూ గత ఆరు నెలల కాలంలో…15.7శాతం పెరిగింది..ఇక రిలయన్స్ షేర్ హోల్డర్లకి ఈ ఆరు నెలల కాలంలో లాభాల పంట పండింది.. ఈ ఆరు నెలల్లోనే షేర్ ధర 54శాతానికిపైగా పెరిగింది. అంటే వంద రూపాయలకి యాభై రూపాయల లాభం దక్కింది.

ఇంత భారీగా లాభాలు పంచిన హెవీ వెయిట్ స్టాక్ మరోటి స్టాక్‌ మార్కెట్‌లో లేదంటే అతిశయోక్తి కాదు..ఓ వైపు తన కంపెనీ వేల్యూ పెంచుకోవడంతో పాటు..మరోవైపు ప్రపంచస్థాయి కంపెనీలను తన కంపెనీలో పెట్టుబడులను పెడుతూ..ఇంటర్నేషనల్ వైడ్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత కార్పొరేట్ కంపెనీల సామర్ధ్యాన్ని చాటుతోంది.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *