reliance-jio-discontinues-rs-49-and-rs-69-prepaid-plans

Reliance Jio కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. ఆ ప్లాన్లు రద్దు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Reliance Jio కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. రూ. 49, రూ. 69 ప్రీ పెయిడ్ ప్లాన్లను రద్దు చేసేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో కంపెనీ ఈ ప్లాన్లను లాంచ్ చేసింది. వీటి వ్యాలిడిటీ 14 రోజులుగా ఉండేది. ప్రస్తుతం jio.com, My Jio.app ల నుంచి తొలగించారు. Jio రూ. 49 ప్లాన్ ద్వారా 2 GB Data డేట వినియోగదారులకు లభించేది. నెట్ స్పడ్ 64 KBPS కు తగ్గిపోనుంది. జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 250 నిమిషాలు, 25 SMS లు అందించే వారు. అంతేగాకుండా…జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్ర్కిప్షన్ లభించేది.

ఇక రూ. 69 ప్లాన్ విషయానికి వస్తే…రోజుకు 7 GB DATA లభించేది. సేమ్ రూ. 49 ప్లాన్ కు ఉన్నట్లుగానే…జియో నుంచి జియోకు ఉచిత కాల్స్ ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 250 నిమిషాలు, 25 ఎస్ఎంఎస్ లు అందించే వారు.

ప్రస్తుతం ఇవి రద్దు అవడంతో రూ. 75 ప్లాన్ సెలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వ్యాలిడెటీ 28 రోజులుగా ఉండేది. 3 GB DATA, జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 500 నిమిషాలు, 50 SMS లభించనున్నాయి.

రూ. 125 ప్లాన్ : దీని వ్యాలిడెటీ 28 రోజులుగా ఉండేది. 14 GB DATA, జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకోవడానికి 500 నిమిషాలు, 300 SMS లభించనున్నాయి.

Related Posts