Reliance Jio 'First Day First Show': Jio Studios to produce 52 movies in a year

జియో ఫస్ట్ షో ఆఫర్ : ప్రతి వీకెండ్ ఓ బ్లాక్ బస్టర్ మూవీ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రిలయన్స్ జియో అధినేత బిలియనీర్ ముఖేశ్ అంబానీ.. ఫస్ట్ డే.. ఫస్ట్ షో సర్వీసు సంచలన ప్రకటన చేయడంతో ఇండియన్ మూవీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ ఒక్కసారిగా షేక్ అయింది. మల్టీఫెక్స్ ఇండస్ట్రీలు కూడా షాక్ అయ్యాయి. అసలు ఫస్ట్ డే.. ఫస్ట్ షో ఎలా సాధ్యం.. అంబానీ ప్లాన్ ఏంటి? దీన్ని ఎలా అమలు చేయబోతున్నారు అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. జియో ఫైబర్ నెట్ వర్క్ ద్వారా ఫస్ట్‌డే ఫస్ట్ షో సర్వీసును ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ కింద.. రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్, మొబిలిటీ ప్లాట్ ఫాం (జియో స్టూడియోస్) నుంచి వారంలో ఒక కొత్త మూవీని రిలీజ్ చేయనున్నారు. ఒక ఏడాదిలో మొత్తం 52 కొత్త మూవీలను రిలీజ్ చేసేలా జియో స్టూడియోస్ ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో సర్వీసును రెండు నుంచి మూడు ఏళ్లలో అమల్లోకి తెచ్చేందుకు రిలయన్స్ జియో ప్లాన్ చేస్తోంది.

ఏడాదికి 52 మూవీలు రిలీజ్ :
‘వారానికి ఒక మూవీ.. ఒక ఏడాదిలో 52 మూవీలు రిలీజ్ చేయనున్నాం. మూవీని ప్రొడ్యూస్ చేసేందుకు మూడు వర్గాల్లో సొంత స్ర్కిప్ట్ డెవలప్ చేయనున్నాం. థర్డ్ పార్టీల నుంచి మూవీలను కొని ఇతర ప్రొడక్షన్ హౌస్ లతో కో ప్రొడ్యూస్ చేయనున్నాం. మొత్తంగా 6 నుంచి 11 భాషాల్లో మూవీలను రిలీజ్ చేయనున్నాం’ అని మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) చైర్మన్ కార్యాలయం, అధ్యక్షులు జ్యోతి దేశ్ పాండే చెప్పారు. మూవీలతో పాటు వెబ్ సిరీస్, మ్యూజిక్, ఇతర లాంగ్ అండ్ షార్ట్ కంటెంట్ తో మొత్తం 11 భాషాల్లో బిజినెస్ ప్రొడక్షన్ జియో స్టూడియోస్ ఆఫర్ చేస్తోంది.   

నిర్మాతలే నేరుగా మూవీలు రిలీజ్ :
రిలయన్స్ జియో.. ఫస్ట్ డే.. ఫస్ట్ షో సర్వీసు ద్వారా 20 మిలియన్ల బ్రాడ్ బ్యాండ్ కనెక్టడ్ హోంలకు భారీగా 10-15 మూవీలను అందించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సర్వీసు ప్రారంభంలో నెలకు ఒకటి లేదా రెండు మూవీలను రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత క్రమంగా వారానికి ఒకో మూవీని రిలీజ్ చేయనున్నారు. మూవీల ప్రొడక్షన్ ఖరీదు రూ.15-20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ సర్వీసుకు జియో మూవీ ప్రదర్శకుల పాత్ర పోషించనుంది. ప్రదర్శకులా మారి పెట్టుబడులు పెట్టి థియేటర్లను నిర్మించనున్నారు.

ఫైబర్, టీవీ, సెట్ టాప్ బాక్సులపై జియో ఖర్చు చేసింది. భవిష్యత్తులో రిలయన్స్ జియో.. ఫస్ట్ డే.. ఫస్ట్ షో ప్లాట్ ఫాంను సినిమా నిర్మాతలే నేరుగా తమ మూవీలను రిలీజ్ చేసుకునేలా సెట్ చేయనుంది. థియేటర్లపై రిలీజ్ చేయడం ద్వారా నిర్మాతలు పొందే లాభాల కంటే అదనపు లాభాలు పొందేలా ఆఫర్ చేస్తోంది. ప్రారంభంలో జియో స్టూడియోస్ మూవీ హౌస్ ప్రొడక్షన్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

READ  కరోనా ఎఫెక్ట్: రిలయన్స్ జియో భారీ ఆఫర్లు

ఇండియాలో 2వేలు.. చైనాలో 35వేల స్క్రీన్లు :
రిల్ అధ్యక్షులు దేశపాండే ప్రకారం.. దేశంలో మూవీ స్ర్కీన్ల షార్టేజీ ఎక్కువగా ఉంది. ఈ రోజు గరిష్టంగా 5వేల స్ర్కీన్లపైనే మూవీలు రిలీజ్ అవుతున్నాయి. అందులో మల్టిఫ్లెక్స్ లతోపాటు సింగిల్ స్ర్కిన్లు కూడా ఉన్నాయి. ఇండియాలో 2వేల మల్టీఫ్లెక్స్ లు ఉండగా చైనాలో 35వేల స్ర్కీన్లు ఉన్నాయి. బాక్సు ఆఫీసు రెవిన్యూ ఎలా పెంచాలి?. ఫస్ట్ డే ఫస్ట్ షో ద్వారా మూవీ ఇండస్ట్రీని విస్తరించనుంది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇళ్లలో కనెక్ట్ అయిన కస్టమర్ల వరకు డిజిటల్ రూపంలో చేరవేస్తుంది’ అని ఆమె అన్నారు. 

Related Posts