8 భాషల్లో జియో వెబ్ బ్రౌజర్ రిలీజ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Reliance JIO : టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్నా రిలియన్స్ జియో సంస్థ తన బ్రౌజర్ ‘జియోపేజెస్’ లాంచ్ చేసింది. క్రోమియం బ్లింక్ ఆధారంగా నడిచే ఈ వెబ్ బ్రౌజర్ ని కంపెనీ బుధవారం (అక్టోబర్21,2020) విడుదల చేసింది. ఇది మేడ్-ఇన్-ఇండియా బ్రౌజర్ గా రెడీ చేసిన ఈ బ్రౌజ‌ర్ లో వినియోగ‌దారుల‌ ప్రైవసీకి పెద్ద‌పీట వేయ‌టంతో పాటు స్థానిక భాష‌ల్లో వినియోగదారుల‌కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. దీంతో వినియోగదారుల డేటా పై పూర్తి నియంత్రణ లభిస్తుంది.ఇందులో వేగంగా స్పందించే స‌ర్చ్ ఇంజ‌న్, ఫాస్ట్ గా పేజీస్ లోడ్ అవ్వ‌టంతో పాటు మీడియా బాగా ప్లే అవ్వడం, ఎమోజీ సపోర్ట్, ఎన్‌క్రిప్టెడ్ కనెక్షన్ వంటి అదిరిపోయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక దేశీయ భాష‌లైన హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ భాషలను ఈ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో వినియోగదారులు యాప్ భాషను ఎంచుకోవ‌చ్చు. ఈ బ్రౌజర్ యాప్ ప్లేస్టోర్ లో అందుబాటులో ఉంది.జియోపేజెస్ ఫీచర్లు:

1. హోం స్క్రీన్ సెలక్ష‌న్స్:
వినియోగదారులు తమకు కావాల్సిన సెర్చ్ ఇంజిన్ ను హోం పేజ్ లో పెట్టుకునే అవకాశం ఉంది. ఇందులో గూగుల్, యాహూ,ఎంఎస్ఎన్ వంటి బ్రౌజర్లు ఉన్నాయి. వీటితో పాటు మీకు కావాల్సిన వెబ్ సైట్లను పిన్ చేసుకోవచ్చు.

2. థీమ్స్ మార్చటం :
ఈ బ్రౌజర్ లో మీకు కావాల్సిన థీమ్స్ లను ఎంచుకోవచ్చు. ఇందులో సిస్టం డిఫాల్ట్, లైట్, డార్క్ మోడ్ థీమ్ లు ఉన్నాయి. మీకు నచ్చిన థీమ్ మీరు ఎంచుకునే అవకాశం ఉంది. మీ కంటికి ఎక్కువ శ్రమ కలగకుండా డార్క్ మోడ్ థీమ్ ను ఎంచుకోవచ్చు.3. కంటెంట్ :
కంటెంట్ ను మీకు ఇష్టమైన భాషల్లో ఎంచుకునే అవకాశంతో పాటు ప్రాంతీయ భాషల కంటెంట్ ను ఎంచుకునే అవ‌కాశం ఈ జియోపేజెస్ లో ఉంది. వినియోగదారులు కంటెంట్ ను తమ ప్రాంతీయ భాషల్లో బ్రౌజర్ చేసుకోవచ్చు. హిందీ, మరాఠీ, తమిళం, గుజరాతీ, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ వంటివి. దీంతో వినియోగదారులు ఈజీగా తమ రాష్ట్రానికి చెందిన కంటెంట్ ను తెలుసుకోవచ్చు.

4. యాడ్ బ్లాకర్ :
ఈ బ్రౌజర్ అనవసరమైన యాడ్లను బ్లాక్ చేసే వీలు ఉంది. దీంతో వినియోగదారులు నిరంతరాయమైన బ్రౌజింగ్ ను ఎంజాయ్ చేయవచ్చు.5. అడ్వాన్స్డ్ డౌన్ లోడ్ మేనేజ‌ర్ :
మీరు చేసే డౌన్ లోడ్ ఫైల్స్ కు తగ్గట్లుగా వేరు వేరు విభాగాల్లో ఫైల్స్ సేవ్ చేయబడతాయి. దీని వల్ల ఫైల్ మేనేజ్ మెంట్ మరింత ఈజీ అవుతుంది.

6. ఇంకోగ్నిటో మోడ్ :
జియో పేజెస్ లో ఈ మోడ్ ఓపెన్ చేయటానికి నాలుగు అంకెల ఫిన్, ఫింగర్ ప్రింట్ లాక్ ను పెట్టుకోవచ్చు. దీని ద్వారా ప్రైవేట్ బ్రౌజింగ్ చేసుకోవచ్చు.

Related Tags :

Related Posts :