వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారా? రిలయన్స్ జియో హైస్పీడ్ డేటా ఆఫర్ మీకోసం

Reliance Jio now offering 252GB high-speed data, unlimited voice calls and more for Rs 999 to boost work from home

కరోనా కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రతిఒక్కరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగుల్లో చాలామంది ఇంటినుంచే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ కరోనాతోనే మొదలైనట్టు కనిపిస్తోంది. ఆఫీసులకు వెళ్లలేని వారంతా తమ ఇంటినుంచే వర్క్ చేస్తున్నారు. అయితే ఆఫీసుల్లో మాదిరిగా ఇంట్లో నుంచి పనిచేయడానికి వాతావరణం అందరికి అనుకూలంగా ఉండదు. ఇంటర్నెట్ నుంచి ఇతర నెట్ వర్క్ సౌకర్యాలు కూడా ఉండాలి. 

అప్పుడే ఎలాంటి అవంతరాలు లేకుండా వర్క్ చేసేందుకు వీలుంటుంది. ఇంట్లో నుంచి పనిచేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరి. టెలికం కంపెనీలు కూడా తమ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన డేటా ప్యాకేజీలను అందిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం వినియోగదారులకు మరిన్ని డేటా బెనిఫెట్స్ అందిస్తున్నాయి. అందులో ప్రముఖ టెలికం దిగ్గజం రియలన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ.999 రీఛార్జీతో 84 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ప్రతిరోజు 3GB వరకు హై-స్పీడ్ డేటాను అందిస్తోంది.  

ఇతర జియో ల్యాండ్ లైన్, మొబైల్ నంబర్లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ చేస్తోంది. రోజువారీ 100 SMSలు అదనంగా అందిస్తోంది. ఇతర నెట్ వర్క్ నంబర్లకు 3,000 వాయిస్ కాలింగ్ నిమిషాలను పొందవచ్చు. జియో యాప్స్ సబ్ స్ర్కిప్షన్ కూడా ఉచితంగా పొందవచ్చు. జియో ఇప్పటికే రూ.599 రీఛార్జీతో రోజువారీ 2GB డేటా, రూ.555 రీఛార్జీతో 1.5GB డేటా ప్లాన్లపై 84 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది. 

Read Here>> వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? జియో ఆఫర్లు ఇవే!

మరిన్ని తాజా వార్తలు