లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

మూడు వారాల్లో అంబానీ ఎంత సంపాదించారంటే!

Published

on

Mukesh Ambani’s Reliance Industries: ముఖేష్ అంబానీ ఎకౌంట్లలోకి వేలకోట్లు వచ్చిపడుతూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా సింగపూర్ GIC, అమెరికాలోని TPG కలసి రియలన్స్ రిటైల్స్‌లో రూ.7,350 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అంటే 1.6శాతం వాట.

రియలన్స్ రిటైల్‌లో GIC రూ.5,512 కోట్లతో 1.22శాతం వాటాను కొంటోంది. ఇక TPG Capital Asia fund 0.41శాతం వాటా కోసం రూ.1,837 ఖర్చు చేసింది. ఈలెక్కన రిలయన్స్ Reliance Industries మార్కెట్ వాల్యూ రూ.4.28 లక్షల కోట్లు.ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు, ఆర్ధికవ్యవస్థలు దెబ్బతింటే అంబానీ కంపెనీ మాత్రం విదేశీ పెట్టుబడులను అయిస్కాంతంగా ఆకర్షిస్తోంది. రిలయన్స్‌లో వాటా కొనుగోలు కోసం కంపెనీలు క్యూకడుతున్నాయి. రియలన్స్ రిటైల్హోల్డింగ్ కంపెనీలో వాటా కోసం పెట్టుబడి పెట్టిన కంపెనీలు, ఈ రెండింటితో కలిపితే ఏడు. 7.3శాతం వాటాలమ్మి 36,200 కోట్లను ఎకౌంట్ లో వేసుకున్నారు అంబానీ.మూడువారాల్లోనే, మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా వరకు ఉన్న గ్లోబల్ ఫండ్స్ Silver Lake, KKR, General Atlantic, Mubadalaలు Reliance Retailలో వేలకోట్లనుఇన్వెస్ట్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. రిలయన్స్ రిటైల్‌కు 12,000 దుకాణాలతో ఒప్పందం ఉంది. అమెజాన్, వాల్ మార్ట్‌తో పోటీపడే JioMartను ప్రారంభించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *