Exclusive: 10 టీవీ చేతిలో స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటన రిమాండ్ రిపోర్టు…వెలుగులోకి కీలక విషయాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు 10టీవీ చేతిలో ఉంది. పోలీసుల అదుపులో ఉన్న కొడాలి రాజగోపాల్ రావు, కూరపాటి సుదర్శన్, వెంకటేష్ స్టేట్ మెంట్స్ ఆధారంగా కమిటీలు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేశాయి.



స్వర్ణ ప్యాలెస్, రమేష్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రిపోర్టులో పేర్కొన్నాయి. లోపాలున్నాయని తెలిసినా స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ సెంటర్ ను రమేష్ ఆస్పత్రి సిబ్బంది ఏర్పాటు చేసినట్లు అధికారులు తేల్చారు. విద్యుత్ లోపాలను సరిచేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. అలాగే కోవిడ్ పేషెంట్ల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని అధికారులు రిపోర్టులో పేర్కొన్నారు.

స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనకు సంబంధించిన నాలుగు పేజీల రిమాండ్ రిపోర్టు 10 టీవీ చేతిలో ఉంది. హోటల్ యాజమాన్యం, రమేష్ ఆస్పత్రి నిర్లక్ష్యమే అగ్నిప్రమాదానికి ప్రధాన కారణమని రిపోర్టు తేటతెల్లం చేసింది. 1987 సంవత్సరంలో రెండస్తుల బిల్డింగ్ లో భవనం ప్రారంభించారు.



స్వర్ణ ప్యాలెస్ లో ప్రధానంగా విద్యుత్ కు సంబంధించి లోపాలున్నట్లు హోటల్, యజమానితో రమేష్ బాబు కోవిడ్ సెంటర్ నిర్వహించినప్పుడు వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించి సమస్యను పక్కన పెట్టి కోవిడ్ సెంటర్ ను నిర్వహించారు. విద్యుత్ సమస్యనే ప్రధాన కారణంగా రిమాండ్ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు.

అయితే ఇది పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి దీన్ని పక్కన పెడదామని హోటల్ యజమాని, రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు పక్కన పెట్టారు. ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ సమస్య.. వీరి అశ్రద్ధతో పది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాగే 21 మంది ప్రాణాపాయంతో బయటపడ్డారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.



ఏదేమైనా నిర్లక్ష్యం కారణంగా జరిగిందని అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కోవిడ్ పేషెంట్ల నుంచి లక్ష రూపాయలు గుంజారు కానీ పేషెంట్ల ఆరోగ్యంతోపాటు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వీరిద్దరు పట్టించుకోకపోవడంతోనే అగ్నిప్రమాదం జరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు.

అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందడం, 21 మంది ప్రాణ భయంతో
బిక్కుబిక్కుమంటూ బయటపడ్డారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నివేదిక సిద్ధం చేశారు. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే రమేష్ ఆస్పత్రికి చెందిన ముగ్గురు సిబ్బందిని అరెస్టు చేసి జైలుకు పంపారు.



స్వర్ణ ప్యాలెస్ యజమానితోపాటు రమేష్ ఆస్పత్రి యజమాని రమేష్ బాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఉదయం రమేష్ వాయిస్ రికార్డు రిలీజ్ చేశారు. హోటల్ తీసుకున్న సమయంలో పూర్తి బాధ్యత హోటల్ యజమానిదని చెప్పారు. లోపాయికారిగా జరిగిన ఒప్పందంలో విద్యుత్ సమస్యను మాత్రం బయటపెట్టలేదు.

పోలీసులపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హోటల్ యజమానిని అరెస్టు చేయలేదు కానీ రమేష్ ఆస్పత్రి సిబ్బందిని ముగ్గురిని అరెస్టు చేశారని, వారికి కోవిడ్ సమస్య వస్తే ఎవరు వైద్యం చేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రమేష్ బాబు కోసం పోలీసులు పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రమేష్ బాబు హైదరాబాద్ లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే రమేష్ బాబు ఎక్కడున్నా సరే పొగబెట్టి బయటకు తీసుకొస్తామని పోలీసులు చెబుతున్నారు.


Related Tags :

Related Posts :