ఐ యామ్ బ్యాక్.. అది అకిరా ఇష్టం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Renu Desai ReEntry: నటి, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్ రీఎంట్రీ ఇస్తున్నారు. త్వరలో ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు కెమెరా ముందుకొస్తున్నట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారామె. కృష్ణ‌ మామిడాల డైరెక్ట్ చేస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌‌లో రేణూ నటించనున్నారు. వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభం కానుంది. డీఎస్‌.రావు, ఎస్‌.రజనీకాంత్ నిర్మిస్తున్నారు.


‌ ‘చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొస్తున్నాను. ఓ అంద‌మైన వెబ్ సిరీస్‌లో నటించేందుకు సైన్ చేశానని చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వ‌చ్చే నెలలో షూటింగ్ మొద‌ల‌వుతుంది. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు చెప్తాను.


స‌త్యాన్వేష‌ణ‌లో ఉన్న ఓ మ‌హిళ ప్ర‌యాణానికి మీ ఆశీస్సులు, ప్రేమ‌ను అందించాల‌ని కోరుకుంటున్నా’ అని రేణూ ఇన్‌స్టా పోస్టులో వెల్లడించారు. కాగా, తన కుమారుడు అకీరా నందన్‌ సినీరంగ ప్రవేశంపై కూడా ఆమె ఇటీవల క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోకి రావడం అనేది పూర్తిగా తన ఇష్టమేనని స్పష్టం చేశారు.

Related Posts