Home » పిల్లలతో పవన్.. బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసిన రేణు దేశాయ్..
Published
2 months agoon
By
sekharRenu Desai – Pawan Kalyan: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆమె షేర్ చేసిన రేర్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రత్యేకత ఏంటంటే ఆ ఫొటోలో పవన్ నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాలను ఆప్యాయంగా హత్తుకున్నారు.
ఆ బ్యూటిఫుల్ మూమెంట్‌ని రేణు కెమెరాలో బంధించారు. బుధవారం ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాలి. అవి మీ ఫోన్ ఫొటో ఆల్బమ్‌లో ఉండలేవు. నా ఫోన్ కెమెరాలో నేను బంధించిన కొన్ని అరుదైన క్షణాలు’.. అంటూ కామెంట్ చేశారు. ఈ ఫొటో పవన్ ఫ్యాన్స్, నెటిజన్స్ అందర్నీ ఆకట్టుకుంటోంది.