లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

చుట్టుముట్టారు, మెడను గట్టిగా పట్టుకున్నారు, బూట్లను వేసుకోనివ్వలేదు

Published

on

Republic TV Editor Arnab Goswami : తనను చుట్టుముట్టడమే కాకుండా…నా మెడను గట్టిగా పట్టుకున్నారని పోలీసులపై Republic TV Editor అర్నాబ్ గోస్వామి ఆరోపణలు గుప్పించారు. ఇందులో తన చేయికి గాయమైందని మీడియాకు చూపించారు. తనను షూస్ వేసుకోనివ్వకుండా చేశారని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. 2020, నవంబర్ 04వ తేదీ బుధవారం ఆర్నాబ్ నివాసానికి పోలీసులు వెళ్లారు. సూసైడ్ కేసులో అర్నాబ్‌ని అరెస్ట్ చేశారు. 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారంటూ అర్నబ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.2018లో అన్వయ్ నాయక్ అనే ఆర్కిటెక్ట్​ తన తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదని ఆరోపిస్తూ వారు ఆత్మహత్య చేసుకున్నారని అధికారులు చెప్పారు. అన్వయ్ కుమార్తె ఆద్న్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసుపై పునర్విచారణ ప్రారంభించినట్లు, ఈ ఏడాది మేలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్​ముఖ్ తెలిపారు.రిపబ్లిక్ టీవీ బకాయిల చెల్లింపుపై ఇదివరకు అలీబాగ్ పోలీసులు విచారణ చేపట్టలేదని.. అందువల్లే తన తండ్రి, నానమ్మ ఆత్మహత్య చేసుకున్నారని ఆద్న్యా ఆరోపించినట్లు దేశ్​ముఖ్ తెలిపారు.