లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

గాలిలో నుంచి నీరు పుట్టిస్తున్న సింగపూర్ యూనివర్సిటీ రీసెర్చర్లు

Updated On - 4:34 pm, Sat, 23 January 21

Air into Water: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ రీసెర్చర్లు ఎటువంటి బాహ్యబలం ఉపయోగించకుండా గాలి నుంచి నీటిని పుట్టిస్తున్నారు. సైన్స్ అడ్వాన్సెస్ లో ఈ స్టడీ పబ్లిష్ అయింది. సింగపూర్ యూనివర్సిటీ స్పాంజ్ లా పనిచేసే అల్ట్రా లైట్ ఏరో జెల్ రెడీ చేసింది. ఇది బ్యాటరీ లేకుండా పనిచేయడంతో పాటు గాలి నుంచి నీటిని శోషించుకోగలదు. అలా అని నీరు రావడం కోసం దానిని పిండేయకూడదు.

ఈ స్టడీ ప్రకారం.. ఒక కేజీ ఏరోజెల్ సాయంతో 17లీటర్ల నీరు ఉత్పత్తి చేయగలం. దీనిని పాలీమర్లతో తయారుచేశారు. ఈ పాలీమర్లే గాలి నుంచి నీటిని శోషించుకుంటుందని స్టడీ చెప్తుంది. అలా చేసి లిక్విడ్ రూపంలోకి మారుస్తుంది. నీరు రూపంలో బయటకు పంపిస్తుంది.

వేడిగా ఉన్న రోజు.. ఏరో జెల్ చాలా వేగంగా పనిచేస్తుంది. 95శాతం నీటి ఆవిరిని లిక్విడ్ వాటర్ గా మారుస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాటర్ స్టాండర్డ్స్ ప్రకారం.. ఈ నీరు తాగేందుకు ఉపయోగపడుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు.

హైడ్రలాజికల్ సైకిల్ ద్వారా వాతావరణంలోని నీరు కంటిన్యూస్ గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. పలు వాతావరణ పరిస్థితుల మధ్య కూడా దీనిని చాలా తక్కువ ఖర్చుతో రెడీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రొఫెసర్ హో ఘీమ్ వీ అంటున్నారు.