reservations finalized for mayors of Municipal corporation in AP

ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. రాష్ట్రంలో 16 మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం (మార్చి 7, 2020) పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతపురం -50, చిత్తూరు -50, ఏలూరు -50 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 

శ్రీకాకుళం -బీసీ మహిళ, విజయనగరం -బీసీ మహిళ, విశాఖ -బీసీ జనరల్, రాజమండ్రి -జనరల్, కాకినాడ -జనరల్ మహిళ, ఏలూరు -జనరల్ మహిళ, మచిలీపట్నం -జనరల్ మహిళ, విజయవాడ -జనరల్ మహిళ, గుంటూరు -జనరల్, ఒంగోలు -ఎస్సీ మహిళ, నెల్లూరు -ఎస్టీ జనరల్, తిరుపతి-జనరల్ మహిళ, చిత్తూరు -ఎస్సీ జనరల్, కర్నూలు -బీసీ జనరల్, కడప-బీసీ జనరల్, అనంతపురం -జనరల్ కేటాయించారు. 

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు, రెండు దశల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒకే విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
* మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు
* జడ్పీటీసీ, ఎంపీటీసీలకు మొదటి దశలో ఎన్నికలు
* పంచాతీయలకు మరో దశలో ఎన్నికలు
* మున్సిపాల్టీలకు మూడో దశలో ఎన్నిలకు
* ఒకే దశలో మున్సిపల్ ఎన్నికలు
* రెండు దశల్లో సర్పంచ్(పంచాయతీ) ఎన్నికలు
* మార్చి 9 నుంచి 11వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్లు
* ఈ నెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, 24న లెక్కింపు
* 660 జడ్పీటీసీ, 10వేల 149 ఎంపీటీసీలకు ఎన్నికలు
* ఈ నెల 23న మున్సిపల్ ఎన్నికలు, 27న ఫలితాలు
* ఈ నెల 27న తొలి దశ సర్పంచి ఎన్నికలు
* 29న రెండో దశ సర్పంచి ఎన్నికలు
* ఏపీలో తక్షణం అమల్లోకి ఎన్నికల కోడ్
 

 

Related Tags :

Related Posts :