దారితప్పిన లేడీ టీచర్, మైనర్ బాలికపై అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గురువు అంటే దైవంతో సమానం. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దేది టీచర్లే. అందుకే గురువులను గౌరవిస్తారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. అయితే కొందరు టీచర్లు దారి తప్పుతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెస్తున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఓ లేడీ టీచర్ మైనర్ బాలికపై(16) కన్నేసింది. మైనర్ బాలికతో లెస్బియన్ బంధం కోసం ప్రయత్నించి కటకటాల పాలైంది. అమెరికాలో ఈ దారుణం జరిగింది.

హోవర్డ్ కౌంటీలోని పబ్లిక్ స్కూల్ లో స్టిఫానీ వాల్జ్ (29) అనే ఉపాధ్యాయురాలు పనిచేస్తోంది. అదే స్కూల్ లో చదువుతున్న ఓ విద్యార్థినిపై కన్నేసిన ఆమె.. బాలికతో సన్నిహితంగా ఉండటం మొదలు పెట్టింది. పాఠాల పేరిట ఆ బాలికకు నిత్యం మెయిల్స్, మెసేజీలు పెట్టింది. టీచర్ కావడంతో విద్యార్థిని ఎప్పుడూ ఎదురు చెప్పలేదు.

ఆ తర్వాత మైనర్ విద్యార్థినిని పబ్ కు తీసుకెళ్లింది టీచర్. స్టూడెంట్ వయసుని దాచిపెట్టి మరీ పబ్ లోనికి తీసుకెళ్లింది. మద్యం తాగాలని కోరింది. ఫార్మాలిటీ కోసం ఆ స్టూడెంట్ మద్యం సేవించింది. ఆ తర్వాత ఇంకా తాగమని టీచర్ బలవంత పెట్టింది. దీంతో బాలిక ఫుల్ గా తాగేసింది. మత్తులో మునిగిపోయింది. ఆ తర్వాత విద్యార్థిని తన ఇంటికి తీసుకెళ్లిన టీచర్ లైంగిక దాడి చేసింది. ఈ ఘటన డిసెంబర్ 2019లో చోటు చేసుకుంది. అప్పటి నుంచి విద్యార్థినిని బ్లాక్ మెయిల్ చేసి స్వలింగ సంపర్కానికి అలవాటు చేసింది. అంతటితో ఆగని టీచర్ మరింత రెచ్చిపోయింది. తన స్నేహితురాళ్లను సైతం రప్పించింది. వారితోనూ లెస్బియన్ బంధం పెట్టుకోమని విద్యార్థినిని వేధింపులకు గురి చేసింది.

కాగా, బాలిక ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. ఇది గమనించిన తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె ఫోన్ చెక్ చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ లో వేల మెసేజ్ లు చూసి వారు షాక్ తిన్నారు. పలు ఫోటోలు, వీడియోలతో తమ కూతురిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులను ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. టీచర్ స్టిఫానీ గురించి తెలుసుకుని షాక్ అయ్యారు. దారితప్పిన టీచర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Related Posts