భార్య, నలుగురు పిల్లలతో నాలుగేళ్లుగా టాయిలెట్‌లో నివాసం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మధ్యప్రదేశ్‌ ఓ కుటుంబం బాత్‌రూంలో నివసించాల్సి వస్తుంది. పేదలకు గృహనిర్మాణం చేస్తామని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్ధానం చేస్తున్నా అమల్లోకి మాత్రం రావడం లేదని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికార యంత్రాంగం ఖండించింది.

టీకాంఘర్‌ జిల్లా మోహన్‌ఘర్‌ ప్రాంతంలోని కేశవ్‌ఘర్‌ గ్రామ పంచాయతీలో మగన్‌లాల్ అహిర్‌వార్ అతడి భార్య, నలుగురు పిల్లలు నాలుగేళ్లుగా టాయిలెట్‌లో నివసిస్తున్నారు. అహిర్వార్ భార్య పూలాదేవి మాట్లాడుతూ తన కుటుంబానికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు రాలేదని అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని తెలిపింది. ఈ జంట తమ కుమార్తెకు ఇదే టాయిలెట్‌లో ఉండి వివాహం కూడా చేశారు. ఉజ్వల పథకం కింద వారికి విద్యుత్ కనెక్షన్‌, గ్యాస్ కనెక్షన్ కూడా వచ్చింది.

ఈ విషయమై స్థానిక తహసీల్దార్‌ అభిజీత్ సింగ్ మాట్లాడుతూ తాను ఈ కేసు గురించి తెలుసుకున్నానని, అహిర్‌వార్‌కు గ్రామంలో పూర్వీకుల ఇల్లు ఉందని, కానీ అతను టాయిలెట్‌లో నివసిస్తున్నట్లు తనకు చెప్పలేదన్నారు. అతడు ఇంతకుముందు మరుగుదొడ్డిలో నివసించి ఉండవచ్చు కానీ ప్రస్తుతం అతను అక్కడ నివసించడం లేదని ఎమ్మార్వో వెల్లడించారు.

Related Posts