లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

తల ఒక చోట, మొండెం మరో చోట… కడపలో రిటైర్డ్ ఉద్యోగి దారుణ హత్య

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్, దారుణ హత్య ఘటన సంచలనం రేపింది. వారం క్రితం

Published

on

retired employ brutal murder in kadapa district

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్, దారుణ హత్య ఘటన సంచలనం రేపింది. వారం క్రితం

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఐసీఎల్ రిటైర్డ్ ఉద్యోగి కిడ్నాప్, దారుణ హత్య ఘటన సంచలనం రేపింది. వారం క్రితం అదృశ్యమైన వెంకటరమణయ్య హత్యకు గురయ్యాడు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ముసలయ్య ఇంట్లో పోలీసులు వెంకటరమణయ్య మొండెం గుర్తించారు. దీంతో పోలీసులు ముసలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కడప శివారులోని గువ్వల చెరువు ఘాట్‌లో తల పెట్టినట్టు ముసలయ్య అంగీకరించడంతో పోలీసులు వెంకటరమణయ్య తలను గుర్తించేందుకు నిందితుడిని తీసుకుని కడప బయల్దేరారు.

ఆర్థిక లావాదేవీలే కారణం?
వెంకట రమణయ్య కనిపించడం లేదని జూన్ 22న ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇంతలో దారుణ హత్యకు గురయ్యారనే వార్త వెలుగులోకి వచ్చింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎర్రగుంట్లలో పలువురికి వెంకటరమణయ్య భారీగా అప్పులు ఇచ్చారు. ముసలయ్య కూడా వెంకటరమణయ్య రూ.50లక్షల వరకు బకాయి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగిందా? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

Read: పెళ్లి పేరుతో టెక్కీని మోసం చేసిన యువతి

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *