పిల్లిని పట్టిస్తే రూ.15వేలు బహుమతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Missing Cat: పిల్లి అనగానే గుర్తొచ్చేది దొంగతనం. కనిపించకుండాపోయిన పిల్లిని పట్టిస్తే ఇచ్చేది తన మీద కోపంతో కాదు ప్రేమతో. పెంపుడు పిల్లి కనపడకపోవడంతో చేసిన ప్రకటన ఇది. ఇండియా మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్వై కమిషనర్ భార్య గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ దగ్గర బుధవారం ట్రైన్ కోసం వెయిట్ చేస్తుండగా మిస్ అయిపోయిందని శుక్రవారం అధికారులు చెబుతున్నారు.

రైలు వస్తున్న చప్పుడుకు భయపడిపోయి పారిపోయిందని గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఇన్‌స్పెక్టర్ బ్రిభన్ పాండే అంటున్నారు. దీని కోసం శర్మ ప్లాట్‌ఫాంలపై పలు పోస్టర్లు కూడా అంటించారు. మిస్సింగ్ పిల్లిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దానికి రెండేళ్ల వయస్సు ఉంటుందని, పచ్చని కళ్లతో పాటు, ముక్కుపై బ్రౌన్ కలర్ లో చుక్క ఉంటుందని దాని గుర్తులు గురించి చెప్పుకొచ్చారు.ముందుగా రూ.11వేల రివార్డ్ ప్రకటించిన అధికారులు తర్వాత దానిని రూ.15వేల వరకూ పెంచారు. శర్మ తన కూతురి సాచి, డ్రైవర్ సురేందర్‌తో కలిసి ఆరో ప్లాట్‌ఫాం వద్ద వెయిట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. దాంతో పిల్లి కోసం జర్నీ క్యాన్సిల్ చేసుకుని గోరఖ్‌పూర్ లోనే ఉండిపోయింది.

Related Tags :

Related Posts :