నా సినిమా సూపర్.. వ్యూస్ చెబితే కొందరికి గుండె ఆగిపోతుంది..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రామ్ గోపాల్ వర్మ ఎన్నికల ఫలితాల తర్వాత కథ అంటూ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘పవర్‌స్టార్’ సినిమా తీశాడు. ట్రైలర్, పాటలతో అంచనాలు పెంచేసిన వర్మ ఈరోజు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో ‘పవర్‌స్టార్’ మూవీని రిలీజ్ చేశాడు.

సినిమా చూసిన తర్వాత ఇంతకీ ఆర్జీవీనీ తిట్టాలా.. పొగడాలా? అని పవన్ ఫ్యాన్స్‌ బిగ్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. ‘పవర్‌స్టార్’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి, సినిమా విశేషాల గురించి వర్మ 10TV Live లో మాట్లాడారు.

‘‘పవర్‌స్టార్’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది కాల్స్, మెసేజుల ద్వారా సినిమా బాగుందని చెప్తున్నారు. సినిమా చూసిన తర్వాత
‘పవర్‌స్టార్’ పాజిటివ్ ఫిల్మ్ అని పవన్ ఫ్యాన్స్ రియలైజ్ అయ్యారు.. ఈ సినిమా కథ పూర్తిగా ఫిక్షనల్.. నేను ఊహించి రాసినదే.. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చేసిన వ్యక్తితో మరో మూడు సినిమాలు చేస్తున్నాను.. అవి ‘పవర్‌స్టార్’ చిత్రానికి సీక్వెల్స్ కావు.. సినిమాకు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి..
వ్యూస్ చెబితే ఇండస్ట్రీలో కొందరికి గుండె ఆగిపోతుంది.. రూల్స్ ప్రకారం వ్యూస్ చెప్పకూడదు’ అని చెప్పారు రామ్ గోపాల్ వర్మ..

Related Posts