లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

కరోనా టీకా కోసం.. రిచ్ ఇండియన్స్ యూకే చెక్కేస్తున్నారంట!

Published

on

Rich Indians Travel Plans COVID Vaccine in UK: కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. డిసెంబర్ 7 నుంచి యూకేలో టీకా అందుబాటులోకి రాబోతోంది. ఇంకేముంది.. బ్రిటన్ ప్రజలతోపాటు ఇతర దేశాల నుంచి సంపన్నులంతా కరోనా వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు. అందులోనూ మన రిచ్ ఇండియన్స్ చాలామంది కరోనా వ్యాక్సిన్ కోసం యూకే చెక్కేస్తున్నారు. ముందుగానే యూకే ట్రావెల్ ప్లాన్ చేసుకుంటున్నారు.


కరోనా టీకా కోసం యూకే వెళ్లేందుకు ఎక్కువ సంఖ్యలో ఆసక్తి చూపిస్తుండటంతో ట్రావెల్ ఏజెంట్లకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. స్వతంత్ర రెగ్యులేటర్ మెడిసిన్స్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) క్లినికల్ ట్రయల్స్‌పై సమగ్ర విశ్లేషణ అనంతరం ఫైజర్ / బయోఎంటెక్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డిసెంబర్ 2న యూకేలో కరోనా వ్యాక్సిన్‌కు అధికారికంగా ఆమోదం లభించింది. కరోనా వ్యాక్సిన్‌ను ఆమోదించిన మొదటి దేశంగా యూకే నిలిచింది. వచ్చే వారం డిసెంబర్ 7 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రజలకు అందుబాటులో వస్తోంది.

ముంబైకి చెందిన ట్రావెల్ ఏజెంట్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. భారత్ నుంచి సంపన్నులో చాలామంది యూకేలో కరోనా టీకా కోసం ప్లాన్ చేస్తున్నారంట.. ఇంతకీ భారతీయులు బ్రిటన్‌లో కరోనా టీకా పొందగలరా? దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. ట్రావెల్ ఏజెంట్లకు కూడా అవును అని చెప్పలేకపోతున్నారు. ఏదేమైనా, యూకేలోని వృద్ధులు, ఆరోగ్య కార్యకర్తలకే ముందుగా కరోనావైరస్ టీకా పొందే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్ ఒకరు తెలిపారు.ఆన్‌లైన్ ట్రావెల్ సంస్థ EaseMyTrip.com వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారి కోసం త్రి-నైట్ ప్యాకేజీని ఆఫర్ చేయాలని యోచిస్తోంది. టీకా కోసం UK వెళ్లే వారి కోసం ప్రత్యేకించి ఫిక్సడ్ ధర సీట్లను అందించాలని భావిస్తోంది. ఈ విషయంలో ఒక విమానయాన సంస్థతో డీల్ కుదర్చుకుంటోంది. ఇప్పటికే లండన్ హోటళ్లతో పలు ఒప్పందాలు ఉన్నాయి. హాస్పిటిలాటీ విషయంలోనూ
అక్కడి హోటళ్లతో కొంత ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. తద్వారా ఒక ప్యాకేజీని రూపొందించాలని భావిస్తున్నామని సహ వ్యవస్థాపకుడు CEO నిశాంత్ పిట్టి వివరించారు. యూకేకు వచ్చే ప్రయాణికులకు టీకాలు వేయాలంటే ముందుగా వారిని క్వారంటైన్ అవసరాలపై UK ప్రభుత్వం నుండి మరింత స్పష్టత రావాల్సి ఉందని నిశాంత్ తెలిపారు.


భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో క్లారిటీ లేదు. అప్పటివరకూ ఆగలేని వారంతా కరోనా వ్యాక్సిన్ ముందుగా వచ్చే పొరుగు దేశాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి దేశాలు ఏమి ఉన్నాయో వెతికే పనిలో పడ్డారు. నవంబర్‌లో ముంబైకి చెందిన జెమ్ టూర్స్ & ట్రావెల్స్ రిచ్ పీపుల్ కోసం కరోనావైరస్ వ్యాక్సిన్ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. యుఎస్ వెళ్ళాలనుకునే వారికి ఈ ప్యాకేజీని ముంబై-న్యూయార్క్-ముంబై విమాన ఛార్జీలను కూడా ప్యాకేజీలో కవర్ చేసింది. టీకా షాట్ తో కలిపి నాలుగు రోజుల (మూడు రాత్రులు)పాటు స్టే చేయొచ్చు.ప్రస్తుతం అమెరికా వెళ్లేందుకు ముందుగా రిజిస్ట్రేషన్లు బుక్ చేసుకుంటున్నారు. ముంబై నుంచి మాత్రమే 5,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. బయటి దేశాల వ్యక్తులు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవడానికి అమెరికా ప్రభుత్వం అనుమతించినప్పుడే వారి వివరాలను వెల్లడిస్తామని జెమ్ టూర్స్ & ట్రావెల్స్ డైరెక్టర్ తేజస్ చెప్పారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *