లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

యువరాజా ఈసారైనా హిట్ కొడతాడా?..

Published

on

RIDER Title First Look Motion Poster: మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు ‘యువ‌రాజా’ నిఖిల్ కుమార్ హీరోగా న‌టిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడ‌ర్’ అనే టైటిల్ ఖ‌రారు చేస్తూ ఫస్ట్ లుక్‌తో పాటు మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.


ఈ చిత్రానికి విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమాను ల‌హ‌రి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై చంద్రు మ‌నోహ‌ర‌న్ నిర్మిస్తున్నారు. ఈ పోస్ట‌ర్‌లో నిఖిల్ కుమార్ యాక్ష‌న్ మోడ్‌లో ‘రైడ‌ర్’ అనే టైటిల్‌కు పూర్తి న్యాయం చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తున్నాడు.


తెలుగు బిగ్‌బాస్‌ అనైతికం.. ఇదేనా మీరిచ్చే సందేశం: నారాయణ


ఫ‌స్ట్ లుక్‌తో పాటు విడుద‌ల చేసిన మోష‌న్ పోస్ట‌ర్ మ‌రింత వివ‌రంగా హీరో చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్‌ను తెలియ‌జేస్తోంది. హీరో బాస్కెట్ బాల్‌ను విసిరేయ‌డం, ఆ త‌ర్వాత ర‌న్నింగ్ చేస్తూ గూడ్స్ కంటైన‌ర్ల మ‌ధ్య త‌న‌పైకి వ‌చ్చిన గూండాల‌ను ఉతికి ఆరేసిన‌ట్లు చూపించ‌డం క‌నిపిస్తోంది. ఈ సినిమాతో నిఖిల్ కుమార్ ఒక ఫెరోషియ‌స్ యాక్ష‌న్ హీరోగా మ‌న ముందుకు రానున్నాడనే అభిప్రాయాన్ని ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్ క‌లిగిస్తున్నాయి.


ఈ చిత్రంలో నిఖిల్ కుమార్ స‌ర‌స‌న నాయిక‌గా క‌శ్మీరా ప‌ర‌దేశి న‌టిస్తున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష ఎం. కుడువ‌ల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణ‌మ‌వుతోంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *