లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

జీతాల్లో కరోనా కోతల్లేవ్.. ఇకపై ఫుల్ శాలరీ.. రిలయన్స్ కీలక నిర్ణయం

Published

on

ril-rolls-back-salary-cuts-with-retrospective-effect-offers-bonus-in-festive-cheer-to-large-workforce

RIL rolls back salary cuts: కరోనా కష్టకాలంలో సామాన్యుని నుంచి కోటీశ్వరులు వరకు.. నష్టాల్లో ఇరుక్కొని, ఇబ్బందుల్లో నలిగిన సంగతి తెలిసిందే. బడా కంపెనీలు సైతం ఉద్యోగులకు వేతనాల్లో కోతలు విధించింది. ఈ క్రమంలోనే ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కరోనా కష్ట సమయంలో ప్రకటించింది. ఉద్యోగుల జీతాల్లో 10 నుంచి 50 శాతం కోత విధిస్తూ సంస్థ అప్పట్లో కీలక నిర్ణయం తీసుకుంది.వార్షిక వేతనం రూ.15 లక్షలు కన్నా తక్కువ ఉన్నవారి దగ్గర కాకుండా ఎక్కువ ఉన్నవారికి జీతాల్లో కోతలు పెట్టింది. రూ.15 లక్షల కంటే ఎక్కువ జీతాలు ఉంటే 10 శాతం కోత, బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు, సీనియర్ లీడర్ల శాలరీల్లో 30 నుంచి 50శాతం కోతలను అమలు చేసింది.


వృద్ధుల కోసమే ఈ కంపెనీ ప్రత్యేకించి ఎందుకు సర్వీసు అందిస్తుందో తెలుసా?


అయితే ఇప్పుడు కరోనా కష్టాల్లో నుంచి కంపెనీ తేరుకోవడంతో రిలయన్స్ గ్రూప్ తన పెట్రోలియం విభాగంలో అమలు చేసిన వేతన కోతలను ముగించింది. ఉద్యోగులకు పని ప్రకారం బోనస్ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. కరోనా కాలంలో పనిచేసినందుకు ఉద్యోగులకు సద్భావన చూపించిన కారణంతో వచ్చే ఏడాది వేరియబుల్ జీతంలో ఉద్యోగులకు 30 శాతం అడ్వాన్స్ ఇవ్వడానికి కంపెనీ ముందుకొచ్చింది. ఈ ఆఫర్ సంస్థలో లక్ష మందికి పైగా ఉద్యోగులకు సహాయపడుతుంది.ఏప్రిల్‌లో కంపెనీ తన హైడ్రోకార్బన్ (పెట్రోలియం) విభాగంలో పది నుంచి 50 శాతం వేతన కోత అమలు చేసింది. చైర్మన్ ముఖేష్ అంబానీ తన జీతం అంతా వదులుకున్నారు. నగదు బోనస్ మరియు పని ఆధారిత ప్రోత్సాహకాల చెల్లింపును కూడా సంస్థ వాయిదా వేసింది. సాధారణంగా ఈ చెల్లింపులు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ అమలు చేస్తుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *