18ఏళ్ల కింద పోయిన ఉంగరం తిరిగి యజమాని చెంతకు. ఇదో పెద్ద కథ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మనం ఎంతో ఇష్టమైన వస్తువులు గానీ, చిన్ననాటి విషయాలకు సంబంధించిన జ్ఞాపకాలు గానీ, విలువైన లాకెట్ వంటి వస్తువులు పోయి దొరికితే ఎంత సంతోషంగా ఉంటామో కదా.. అలాంటిదే 18 సంవత్సరాల కిందట అమీ గోయెట్జ్ తన ఉంగరాన్ని బీచ్‌లో పోగొట్టుంది. జాన్ పోర్సెల్లా అనే వ్యక్తి ఆ ఉంగరాన్ని కనిపెడతాడు. అది ఎవరిదో వారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ ఉంగరాన్ని సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

 

జాన్ పోర్సెల్లా అనే వ్యక్తి ఒకసారి బీచ్‌లో లోహన్ని గుర్తించే పనిలో మునిగిన సమయంలో అతనికి ఒక ఉంగరం కనిపించింది. అసలు.. ఆ ఉంగరం ఎవరిదో తెలుసుకుని వారికి అందజేయాలని నిర్ణయించుకున్నాడు. కొంతమంది వ్యక్తుల సహాయంతో రింగ్ పైన ఉన్న కాలిన్స్ హిల్ హైస్కూల్ పేరు ఆధారంగా ఆ వ్యక్తిని కనిపెట్టాను అని తెలిపాడు. ఆమె పేరు అమీ గోయెట్జ్. ఆమె 2002లో ఫ్లోరిడాలోని బీచ్ సందర్శంచినప్పుడు తన ఉంగరం పోయిందని మళ్లీ 18 ఏళ్ల తరువాత తిరిగి తన దగ్గరకు చేరినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.

 

ఆ రింగును చూడటంతో తన స్కూల్ జ్ఞాపకాల అన్ని తిరిగి దొరికినంతగా చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఈ విషయాన్ని జాన్ పోర్సెల్లా తన ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ, రింగు ఫోటోలను కొన్ని పోస్టు చేశాడు. చాలా సంవత్సరాల క్రితం పోయిన వస్తువు తిరిగి లభించటంతో వారి సంతోషాన్ని హద్దులు లేవు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read: ముఖానికి ప్లాస్టిక్ ‘ఫేస్ షీల్డ్’ ధరించడం మంచిదేనా?

Related Posts