లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-2

మారడోనాకు బదులు మడోన్నాకు RIP

Published

on

Maradona: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ అర్మాండో మారడోనా బుధవారం గుండెనొప్పితో మృతి చెందారు. 60ఏళ్ల ఈ వెటరన్ ఫుట్‌బాలర్‌కు రెండు వారాల క్రితమే బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అవడంతో సర్జరీకి వెళ్లొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.

తమ ఫేవరేట్ ఫుట్‌బాలర్ కోల్పోయిన దుఖంలో ట్వీట్ లు చేస్తుంటే పొరబాటుగా మారడోనాకు తెలియజేయాల్సిన సంతాపం మడోన్నా పేరు మీద ట్వీట్ అవుతున్నాయి. ఈ కారణంతోనే ఐకానిక్ సింగర్ మడోన్నా పేరు ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది. ఈ కన్ఫ్యూజన్లో పాప్ క్వీన్ మడోన్నాకు రెస్ట్ ఇన్ పీస్ అంటూ చేస్తున్న ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.ఫుట్‌బాల్ పేరు చెబితే మొదటగా గుర్తొచ్చే పేరు డిగో మారడోనా. ఆ క్రీడను అంతలా ప్రభావితం చేశారాయన. అర్జెంటీనాకు ఎన్నో ట్రోఫీలు అందించారు. నాలుగు సార్లు ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో పాల్గొన్న డిగో… 1986లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు చేర్చడంలో, కప్పు అందించడంలో మారడోనా కీలక పాత్ర పోషించారు.

ఆ టోర్నీ తర్వాత మారడోనా పేరు మార్మోగిపోయింది. 1990 ప్రపంచ కప్‌లో అర్జెంటీనా జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లారు. ఆయన బొకా జూనియర్స్, నాపోలి, బార్సిలోనా క్లబ్ జట్ల తరఫున పలు మ్యాచ్‌‌లు ఆడారు. మారడోనా 1997లో ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు రిటర్మెంట్ ప్రకటించారు. 2008లో అర్జెంటీనా ఫుట్‌బాల్ జాతీయ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *