లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

రిషబ్ పంత్ డీఆర్ఎస్ రిక్వెస్ట్‌కు నవ్వేసుకున్న రహానె, రోహిత్ శర్మ

Published

on

Rishabh Pant: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా చివరి టెస్టు మ్యాచ్‌లో ఫన్నీ సీన్ నమోదైంది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ డీఆర్ఎస్ అడుగుదామని రహానెను అడగడంతో అంతా నవ్వుకున్నారు. 84వ ఓవర్‌లో నటరాజన్‌ వేసిన మూడో బంతి లెంగ్త్‌ బాల్‌ కాస్త స్వింగ్‌ అవుతూ బ్యాట్స్‌మెన్‌ను టచ్ అవుతూ వికెట్‌ కీపర్‌ పంత్‌ చేతుల్లోకి వెళ్ళింది. ఔట్‌ విషయంలో డీఆర్‌ఎస్‌ కోరదామని ఎంత మెుత్తుకున్నా వినలేదు.

వెంటనే పంత్ ఔట్‌ కోసం అప్పీల్‌ చేశాడు. ఆ అప్పీల్‌పై అంపైర్‌ నుంచి మొదలుకొని టీమిండియా క్రికెటర్లూ ఎవరూ స్పందించలేదు. కెప్టెన్ రహానె దగ్గరకు వెళ్లి డీఆర్ఎస్ అడగమని చెప్పడంతో నవ్వుకుని ఊరుకున్నాడు. ఆ తర్వాత స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ, పూజారా కూడా నవ్వుకున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ 87 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కామెరాన్‌ గ్రీన్‌(28: 70 బంతుల్లో), కెప్టెన్‌ టిమ్‌పైన్‌ (38: 62 బంతుల్లో) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో నటరాజన్‌ 2 వికెట్లు తీయగా, శార్దూల్‌ ఠాకుర్‌, మహ్మద్‌ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ తీశారు.