లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

వంద దాటేస్తుందా?

Updated On - 12:58 pm, Fri, 22 January 21

Rising-petrol-and-diesel-prices

Rising petrol and diesel prices again : పెట్రోల్‌, డీజీల్‌ ధరలు రోజురోజుకూ చుక్కలనంటుతున్నాయి. ఇప్పటికే గరిష్టస్థాయికి చేరిన ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. లీటర్‌ పెట్రోల్‌, డీజల్‌పై చమురు సంస్థలు మరో 25 పైసలు వడ్డించాయి. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. వారం వ్యవధిలో రూపాయిన్నర మేర పెట్రోల్‌, డీజిల్‌ ధర పెరగడంతో వాహనదారులు మండిపడుతున్నారు.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 85.45 రూపాయలు, డీజిల్ ధర 75.63 గా ఉంది. ముంబై, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 90 రూపాయలు దాటింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర 92 రూపాయల 4 పైసలు, డీజిల్ ధర 82 రూపాయల 40 పైసలు, విజయవాడలో లీటరు పెట్రోల్ ధర 91.37 రూపాయలు, డీజిల్ 84.53 రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 88.89 రూపాయలుగా ఉంది.