Home » శానిటైజర్లతో పిల్లల కళ్లకు ప్రమాదం
Published
1 month agoon
Risk to children’s eyes with sanitizers : కరోనా రాకముందు కేవలం డాక్టర్ల దగ్గర మాత్రమే కనిపించే శానిటైజర్.. ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ దర్శనమిస్తోంది. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు శానిటైజర్ ను వాడాలన్న సూచనతో అందరూ విరివిగా వాడుతున్నారు. డాక్టర్ల సూచనలతో చేతులు శుభ్రంగా కడిగే ఓపిక లేనివాళ్లు లీటర్లకు లీటర్ల శానిటైజర్లను చేతులకు రుద్దేసుకుంటున్నారు.
ఇళ్లు, ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లు ఎక్కడ చూసినా శానిటైజర్లు సాధారణమైపోయాయి. అయితే వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలని తాజా అధ్యయనం తేల్చింది. ముఖ్యంగా ఈ శానిటైజర్ల వల్ల పిల్లల కళ్లు దెబ్బ తింటున్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది.
చేతులకు శానిటైజర్లను రుద్దుకుంటున్న పిల్లలు ఆ వెంటనే కళ్లు తుడుచుకోవడం వల్ల అవి దెబ్బతింటున్నట్లు అధ్యయనంలో తేలింది. అంతకముందు ఏడాదితో పోల్చితే 2020, ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 24 మధ్య పిల్లల కళ్లు దెబ్బతిన్న కేసులు ఏకంగా ఏడు రెట్లు పెరిగినట్లు ఈ అధ్యయనం నిర్వహించిన ఫ్రెండ్ పాయిజన్ కంట్రోల్ సెంటర్ వెల్లడించింది.
శానిటైజర్లలోని ప్రమాదకర రసాయనాలు పిల్లల కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది. 2019 వరకు రసాయనాల వల్ల కళ్లు దెబ్బతిన్న కేసుల్లో శానిటైజర్ల వాటా 1.3 శాతం. 2020 చివరినాటికి అది కాస్తా 9.9 శాతానికి చేరినట్లు తెలిపింది.
ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు 2నెలలు సెలవులు.. నిజం ఏంటంటే..
కరోనాకు వ్యాక్సిన్ మాత్రమే కాదు.. డీ విటమిన్ కావాలి
ఏపీ, తెలంగాణ రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో పట్టాలపైకి మరో 22 ప్రత్యేక రైళ్లు
నేటి నుంచి జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్..ఆలస్యంగా వస్తే నో ఎంట్రీ, కరోనా లేదని సెల్ఫ్ డిక్లరేషన్
మా సైనికులు కరోనానే లెక్క చెయ్యలేదు, జగన్ ఓ లెక్కా..
ప్రపంచాన్ని భయపెడుతున్న వైరస్ భూతం