road-accident-in-anantapur-district-15-laboures-injured

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం : ఆటోను ఢీ కొట్టిన లారీ… 15 మంది కూలీలకు గాయాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Road accident in Anantapur : అనంతపురం జిల్లా గుత్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తొండపాడు గ్రామం సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.


పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం, ఆరుగురు చిన్నారులతో సహా 14మంది దుర్మరణం


గుత్తి మండలం తొండపాడు గ్రామం నుంచి కూలీ పని కోసం 15 మంది ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Tags :

Related Posts :