రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్లు మృతి, మృతుల్లో 11 నెలల చిన్నారి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Road accident mother and daughter died : హైదరాబాద్‌ అబ్దుల్లాపూర్ మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డు పై ముందు వెళ్తున్న వాహనాన్ని కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తల్లీకూతుళ్లు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 11 నెలల చిన్నారి చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రయాణికుల పాలిట మృత్యుదారులుగా మారుతున్నాయి. మానవ తప్పిదమే మనకు భద్రత లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ వాహనం ఢీకొని ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి.రోడ్డు ప్రమాదాలకు రహదారుల నిర్మాణం ఒక కారణమైతే.. నిబంధనలు పాటించకపోవడం, అతివేగం, మద్యం సేవించడం వేరే కారణాలు. రెండు రాష్ట్రాల్లో ఒక్క రోజు వ్యవధిలో 5 ఘోర రోడ్డు ప్రమాదాలు జరగడం ఆందోళనకు గురిచేస్తోంది.

Related Tags :

Related Posts :