Home » ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం..30 మంది కూలీలకు గాయాలు
Published
2 months agoon
By
bheemrajMulugu district Road accident : ములుగు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. 35 మంది కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వాజేడు-ఏటూరు నాగారం మండలంలో 163వ నెంబర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ఆ సమయంలో బొలెరో వాహనంలో 12 మందికిపైగా మహిళలు ఉన్నారు. దీంతో ఆ 12 మంది మహిళా కూలీలు గాయపడ్డారు. వీరంతా వాజేడు మండలంలో మిర్చి తోటల్లో పనిచేసేందుకు బొలెరో వాహనంలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాహనంలో సామర్థ్యానికి మించి కూలీలను ఎక్కించడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.