కాసేపట్లో పెళ్లి, ఇంతలోనే ఘోరం.. వరుడి ప్రాణం తీసిన కారు, వధువుకి తీవ్ర గాయాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

road accident : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్‌లు ఫెయిల్‌ అయిన బ్రిజా కార్‌… రెండు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు.

హైదరాబాద్‌ హయత్‌నగర్‌కు చెందిన శ్రీలత, నాగరాజు ప్రేమ వివాహం చేసుకోవడానికి చెర్వుగట్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాసేపట్లో పెళ్లిపీటలెక్కాల్సిన నాగరాజును కారు రూపంలో మృత్యువు కబళించడం.. అందరినీ కలచి వేసింది. బ్రిజా కారు వేగంగా డీకొట్టడంతో… ఒక స్కూటీలో పెట్రోల్‌ లీకయ్యి…మంొటలు చెలరేగాయి. ఈ మంటల్లో స్కూటీ పూర్తిగా దగ్దమయ్యింది.

Related Tags :

Related Posts :