డొనాల్డ్ ట్రంప్‌ తమ్ముడు కన్నుమూత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికా అధ్యక్షుడి ఇంట విషాదం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్‌ ట్రంప్ రాబర్ట్ ట్రంప్(71)శనివారం న్యూయార్క్‌లో కన్నుమూశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు.అనారోగ్య కారణాలతో కొంతకాలంగా న్యూయార్క్‌లోని ప్రెస్బిటేరియన్ హాస్పిటల్ లో రాబర్ట్ ట్రంప్ చికిత్స పొందుతూ వచ్చాడు. రాబర్ట్ ట్రంప్ అనారోగ్యానికి స్పష్టమైన కారణాలేంటో తెలియడం లేదు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన్ను డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజు ముందే పరామర్శించి వచ్చారు. 1948లో జన్మించిన రాబర్ట్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడి నలుగురి సోదరులలో ఒకరు. డొనాల్డ్ ట్రంప్ కంటే రాబర్ట్ రెండేళ్లు చిన్నవాడు.

రాబర్ట్‌ మృతికి బరువెక్కిన హృదయంతో డొనాల్డ్ ట్రంప్‌ సంతాపం తెలిపారు. రాబర్ట్ నాకు సోదరుడు మాత్రమే కాదు… బెస్ట్ ఫ్రెండ్ కూడా…ఆయన గత రాత్రి కన్నుమూశాడంటూ ఓ ప్రకటనలో ట్రంప్ వెల్లడించారు. బరువెక్కిన హృదయంతో తన తమ్ముడు రాబర్ట్‌కి వీడ్కోలు పలుకుతున్నట్లు పేర్కొన్నారు. అతని జ్ఞాపకాలు తన గుండెల్లో ఎప్పటికీ ఉంటాయన్నారు.నా అద్భుత సోదరుడు రాబర్ట్ శాంతియుతంగా ఈ రాత్రి కన్నుమూశాడు. అతను నా సోదరుడు మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు. అతడి జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి. ఐ లవ్ యూ రాబర్ట్. ఇక మీదట విశ్రాంతి తీసుకో అని అమెరికా అధ్యక్షుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్‌కు రాబర్ట్ పూర్తి బాసటగా నిలిచేవారు. డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఆయన అన్న(ఫ్రెడ్ జూనియర్) కూతురు మేరీ ట్రంప్ రాసిన పుస్తకం విడుదల కాకుండా కోర్టుకెళ్లి విఫలయత్నం చేశాడు రాబర్ట్ ట్రంప్. 2016లో రాబర్ట్ ట్రంప్ తన సోదరుడితో పాటు రిపబ్లికన్‌ పార్టీకి మద్దతుగా మిల్‌బ్రూక్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించి నిధులు సైతం సేకరించారు.ఫ్రెడ్, మరీ అన్నీ ట్రంప్ దంపతులకు ఐదుగురు సంతానంకాగా…వారిలో రాబర్ట్ ట్రంప్ అందరికంటే చిన్నవాడు. వీరిలో అందరికంటే పెద్దవాడైన ఫ్రెడ్ జూనియర్ 1981లో కన్నుమూశారు. రాబర్ట్ ట్రంప్ తమ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారాలు చూస్తుండేవారు. డొనాల్డ్ ట్రంప్‌లా కాకుండా రాబర్ట్‌కు పబ్లిసిటీ అంటే ఏ మాత్రం నచ్చేది కాదు. గత కొంతకాలంగా ఆయన దాదాపు విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నారు.

Related Tags :

Related Posts :