Home » మళ్లీ ఏమైంది: రోహిత్, రహానెలతో పాటు మరో ముగ్గురికి హోం క్వారంటైన్..?
Published
1 month agoon
Rohit Rahane: టీమిండియా క్రికెట్ టీం గురువారం ఉదయానికి ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఇండియాకు చేరుకుంది. ఆస్ట్రేలియా పర్యటనకుముందు హోం క్వారంటైన్ లో ఉన్న రోహిత్ శర్మకు మళ్లీ క్వారంటైన్ తప్పలేదు. ఇండియాకు వచ్చిన తర్వాత మరోసారి ఏడు రోజుల క్వారంటైన్ లో ఉండాలని సూచించారు అధికారులు. అతనితో పాటు మరో నలుగురికి క్వారంటైన్ తప్పడం లేదు.
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోకి దిగగానే క్రికెట్ టీం సభ్యులకు ఆర్టీ-పీసీఆర్ టెస్టు నిర్వహించారు. బృహన్ముంబై మునిసిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.. కొందరు ప్లేయర్లు మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండక తప్పదు’ అని చెప్పారు.
వీరిలో అజింకా రహెన్, రోహిత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, పృథ్వీ షాలు ఉన్నారు. టీమిండియా హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా అదే రోజు ఉదయం ముంబైలో దిగారు. గాయాలతో సతమతమైనప్పటికీ టీమిండియా ఆస్ట్రేలియాను మూడు వికెట్ల తేడాతో చివరి టెస్టు ఓడించి.. బ్రిస్బేన్ సాక్షిగా సిరీస్ ను కైవసం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తేడాతో సొంతం చేసుకుంది.
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు ప్లేయర్లను అభినందించగా.. కెప్టెన్ రహానెతో కేక్ కట్ చేయించారు.
ఇంగ్లాండ్ పర్ఫార్మెన్స్ పొగిడి చిక్కుల్లో పడ్డ మైకెల్ వాన్
పేలుడు పదార్ధాల కేసులో ట్విస్ట్..ముఖేష్, నీతా అంబానీని టార్గెట్ చేస్తూ బెదిరింపు లేఖ
సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైల్లో తీవ్ర కలకలం, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
ముఖేష్ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం
యాప్ లోనే ఆలయ దర్శనం
హిట్ మ్యాన్ రికార్డు బ్రేక్ చేసిన గఫ్తిల్