లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

రోజా, శేఖర్ మాస్టర్ స్టెప్స్ – వైరల్ అవుతున్న మీమ్స్!..

రోజా, శేఖర్ మాస్టర్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Published

on

Roja and Sekhar Master Meems Viral on Social Media

రోజా, శేఖర్ మాస్టర్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. సోషల్ మీడియాలో జనాలు యమా యాక్టివ్‌‌గా ఉంటున్నారు. ముఖ్యంగా యువత కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నా, మీమ్స్‌తో సందడి చేయాలన్నా ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటున్నారు. తాజాగా రోజా, శేఖర్ మాస్టర్ల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆన్‌స్క్రీన్ రోజా, శేఖర్ మాస్టర్‌ల డ్యాన్స్, కెమిస్ట్రీ, రొమాన్స్ ఏ రేంజులో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరికీ అలా సింక్ అయిందంతే. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్డ్, రియాలిటీ షోలతో క్షణం తీరికలేకుండా గడిపే రోజా, ఈ జెనరేషన్ యాంకర్లతో పోటీపడుతూ.. ఇప్పటికీ అదే ఎనర్జీతో తనకు తానే సాటి అంటూ దూసుకెళ్తోంది.

బుల్లితెరపై రోజా, శేఖర్ మాస్టర్‌లది పర్ఫెక్ట్ జోడి అని ప్రేక్షకులందరూ చెబుతుంటారు. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి పలు పాటలకు దుమ్ములేపే స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో సర్‌ప్రైజ్ చేశారు రోజా, శేఖర్ మాస్టర్.. 

Read Also : రోజా – శేఖర్ మాస్టర్.. స్టెప్స్ అదరగొట్టేశారుగా!

ఉగాది కానుకగా ఈటీవీ వారు ‘పండగ సర్ పండగ అంతే’ అనే స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తాజాగా ప్రోమో విడుదల చేయగా.. రోజా, శేఖర్ మాస్టర్ ‘అల వైకుంఠపురములో’.. చిత్రంలోని ‘సామజవరగమనా’తో సహా పలు పాటలకు అదిరిపోయే స్టెప్స్ వేశారు. ఈ ప్రోమో స్క్రీన్ షాట్స్ తీసి ఎవరి క్రియేటివిటీకి తగ్గట్టు వారు రకరకాల మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారాయి..

 

 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *