Roja and Sekhar Master Superb Dance in Ugadi Special Event 'Pandaga Sir Pandaga Anthe'

రోజా – శేఖర్ మాస్టర్.. స్టెప్స్ అదరగొట్టేశారుగా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బుల్లితెరపై రోజా, శేఖర్ మాస్టర్ ‘సామజవరగమనా’ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేశారు..

ఆన్‌స్క్రీన్ రోజా, శేఖర్ మాస్టర్‌ల డ్యాన్స్, కెమిస్ట్రీ, రొమాన్స్ ఏ రేంజులో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరికీ అలా సింక్ అయిందంతే. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్డ్, రియాలిటీ షోలతో క్షణం తీరికలేకుండా గడిపే రోజా, ఈ జెనరేషన్ యాంకర్లతో పోటీపడుతూ.. ఇప్పటికీ అదే ఎనర్జీతో తనకు తానే సాటి అంటూ దూసుకెళ్తోంది.

బుల్లితెరపై రోజా, శేఖర్ మాస్టర్‌లది పర్ఫెక్ట్ జోడి అని ప్రేక్షకులందరూ చెబుతుంటారు. ఇప్పటికే వీళ్లిద్దరూ కలిసి పలు పాటలకు దుమ్ములేపే స్టెప్స్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి తమ డ్యాన్స్ మూమెంట్స్‌తో సర్‌ప్రైజ్ చేశారు రోజా, శేఖర్ మాస్టర్.. 

Read Also : రోజా, శేఖర్ మాస్టర్ స్టెప్స్ – వైరల్ అవుతున్న మీమ్స్!..

ఉగాది కానుకగా ఈటీవీ వారు ‘పండగ సర్ పండగ అంతే’ అనే స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. తాజాగా ప్రోమో విడుదల చేయగా.. రోజా, శేఖర్ మాస్టర్ ‘అల వైకుంఠపురములో’.. చిత్రంలోని ‘సామజవరగమనా’ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేశారు. దీంతో పాటు పలు సూపర్ హిట్ సాంగ్స్‌కు హుషారుగా కాలు కదిపారు. ఈ ప్రోమోలో రోజా, శేఖర్ మాస్టర్ల కెమిస్ట్రీ కిరాక్ ఉంది అంటున్నారు ఆడియన్స్. 

Read Also : హెల్ప్ కోసం ఫస్ట్ ఫోన్ కాల్ రోజాకే.. రియాక్షన్ విని చెమటలు పట్టాయి..

 

Related Posts