లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

Romeo for India : భారత నేవీ అత్యాధునిక హెలికాఫ్టర్ ఫస్ట్ లుక్

Published

on

Romeo for India అమెరికా నుంచి 24 MH‌-60 రోమియో మల్టీ రోల్ హెలికాప్ట‌ర్లను భారత్ కొనుగోలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇరు ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు అమెరికా నుంచి 2.4 బిలియన్​ డాలర్లు(రూ.16,320 కోట్లు)కి 24 MH‌-60 రోమియో మల్టీ రోల్ హెలికాప్ట‌ర్లను భారత్ కొనుగోలు చేస్తోంది. త్వరలోనే ఈ సబ్​మెరైన్ ప్రతిరోధక​ హంటర్​ హెలికాప్లర్లు భారత్​కు రానున్నాయి.



అమెరికాకు చెందిన “లాక్​హీడ్​ మార్టిన్”సంస్థ ఈ హెలికాఫ్టర్లను తయారుచేస్తోంది. త్వ‌ర‌లో భార‌త్‌ కు రానున్న ఎంహెచ్‌-60 రోమియో హెలికాప్ట‌ర్ల తొలి ఫోటోను శుక్రవారం(డిసెంబర్-4,2020)ఇండియన్ నేవీ డే సందర్భంగా లాక్‌హీడ్ మార్టిన్ రిలీజ్ చేసింది. భార‌తీయ నౌకాద‌ళ రంగుల్లో ఆ మ‌ల్టీరోల్ హెలికాప్ట‌ర్ ద‌ర్శ‌న‌మిస్తోంది.



కాగా, ప్రస్తుతం అమెరికా నావికాదళం ఉపయోగిస్తోన్న ఈ బహుళార్థక ఎమ్​హెచ్​-60 ‘రోమియో’ సీహాక్ శ్రేణిని ప్రపంచంలోనే అత్యుత్తమ మారిటైమ్​ హెలికాప్టర్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ఈ ‘రోమియో’ సీహాక్​ హెలికాప్టర్లు యాంటీ-సబ్​మెరైన్​, యాంటీ-సర్ఫేస్​ వార్ ​ఫేర్, నిఘా, సమాచార వ్యవస్థలు, రక్షణ, సహాయక చర్యలకు,నావికా యుద్ధాల్లో వినియోగించేందుకు అనువైనవిగా పేరుపొందాయి.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *