romes-fiumicino-airport-awarded-worlds-first-five-star-anti-covid-award1

ప్రపంచంలోనే తొలి యాంటీ ‘కొవిడ్-19 ఫైవ్‌స్టార్ ఎయిర్ పోర్ట్’

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ ప్రయాణికుల దరి చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రోమ్ ఫుయిమిసీనో ఎయిర్ పోర్టు (FCO) కు అరుదైన గుర్తింపు లభించింది. విమానప్రయాణ రేటింగ్ సంస్థ స్కైట్రాక్స్ లియోనార్డో డా విన్సీ అంతర్జాతీయ విమానాశ్రయం అని కూడా పిలవబడే ఫుయిమిసీనో ఎయిర్ పోర్టుకు కొవిడ్-19 ఫైవ్‌స్టార్ ఎయిర్ పోర్టు రేటింగ్‌ను ఇచ్చింది. ప్రపంచంలోనే ఇటువంటి అరుదైన గుర్తింపు పొందిన తొలి ఎయిర్ పోర్టు ఇదే కావడం గమనించాల్సిన విషయం. ఇటలీలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం ఇది. ప్రపంచంలోని ఉత్తమ విమానాశ్రయాల వార్షిక ర్యాంకింగ్‌లకు స్కైట్రాక్స్ బాగా ప్రసిద్ది చెందిందనే విషయం ప్రత్యేకించి చెపనక్కరలేదు.


కరోనా వ్యాప్తిని నివారించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు నిబంధనలు పాటించారు. తగిన చర్యలూ తీసుకున్నారు. కానీ..ప్రయాణికుల కోసం వారి ఆరోగ్యం కోసం కరోనా కట్టడి కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవటంలో మాత్రం.. రోమ్ ఎయిర్ పోర్టు పటిష్టమైన చర్యలు చేపట్టిందని స్కైట్రాక్స్ తెలిపింది. ప్రయాణికులు గుంపులుగా ఉండే ప్రదేశాలలో..వారిని నిరంతరం పర్యవేక్షించటం కోసం వారిని నియంత్రించటం కోసం ఫుయిమిసీనో ఎయిర్ పోర్టు యాజమాన్యం ఏకంగా 40 మంది ప్రత్యేక సిబ్బందిని నియమించిందని..అదే సమయంలో.. ఎయిర్ పోర్ట్ సిబ్బంది కొవిడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేశారని తెలిపింది.


‘కరోనా ప్రోటోకాల్స్ అమలు చేయడంలో కూడా రోమ్ ఫుయిమిసీనో ఎయిర్ పోర్టు అద్భుతంగా పనిచేసింది. ప్రయాణీకులు, సిబ్బంది, స్టాల్స్ సిబ్బంది వారి ఆరోగ్య భద్రత కోసం సురక్షితమైన చర్యల్ని తీసుకుంది. వాటిని కట్టుదిట్టంగా అమలు చేసింది. ఎయిర్ పోర్టులోని కీలకమైన ప్రదేశాల్లో..చేతుల శుభ్రత, భౌతిక దూరం నియమాలను పాటించేలా పటిష్టమైన విధానాలను నేటికీ కొనసాగిస్తోంది.


అంతే కాదు..ఈ నిబంధనలన్నీ కచ్చితంగా అమలయ్యేలా నిరంతరం చర్యలు తీసుకుంటోంది. వాటిని నిరంతరంగా పర్యవేక్షిస్తోంది. దీంతో రోమ్ ఫుయిమిసీనో ఎయిర్ పోర్టుకు కొవిడ్-19 ఫైవ్‌స్టార్ ఎయిర్ పోర్టుగా గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం’ అని స్కైట్రాక్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.


కోవిడ్-19 ఫైవ్‌స్టార్ ఎయిర్ పోర్టుగా లభించిన రేటింగ్ పై ఫుయిమిసీనో ఎయిర్ పోర్టు సీఈఓ హర్షం వ్యక్తం చేశారు. ఫైవ్‌స్టార్ అవార్డు లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని..కరోనా నిబంధనల అమలు కోసం తాము చేస్తున్న కృషికి ఇది నిదర్శనం అని సీఈఓ సంతోషం వ్యక్తం చేశారు. కాగా..ఈ ఎయిర్ పోర్ట్ లో 7,000 చదరపు అడుగుల కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని నెలకొల్పింది. ఇటాలియన్ రెడ్‌క్రాస్‌తో కలిసి ఈ కేంద్రాన్ని నిర్వహింస్తోంది.

Related Posts