లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘రౌడీ బేబీ’ రికార్డ్.. 90 కోట్ల వ్యూస్ క్రాస్..

Published

on

rowdy-baby-video-song-hits-900mviews

కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి నటించిన ‘మారి 2’లో ‘రౌడీ బేబీ…’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో వ్యూస్ ప‌రంగా రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్‌గా రౌడీ బేబీ వీడియో సాంగ్ 90 కోట్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఓ ద‌క్షిణాది సాంగ్‌కు ఈ రేంజ్ ఆద‌ర‌ణ ద‌క్క‌డం ఇదే తొలిసారి.  Rowdy Baby యువన్ శంకర్ రాజా ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా మాస్టర్ ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ చేశారు. ఆయ‌న కంపోజిష‌న్ ఎన్‌హెన్స్ చేస్తూ ధ‌నుష్, సాయి ప‌ల్ల‌వి అద్భుతంగా స్క్రీన్‌పై ప్రెజంట్ చేశారు. ఈ పాటకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు చాలామంది కాలర్ ట్యూన్ ఈ పాటే.. బాలాజీ మోహ‌న్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వండ‌ర్ బార్ ఫిలింస్ ప‌తాకంపై ధ‌నుష్ నిర్మించారు. త్వరలో ‘రౌడీ బేబీ’ బిలియన్ మార్క్ టచ్ చేయబోతోంది.

 Rowdy Baby

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *