లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Business

Royal Enfield నుంచి న్యూ బైక్ లాంచ్

Published

on

Royal Enfield Meteor 350 launched, : బైకుల్లో పేరుగాంచిన రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ ను లాంచ్ చేసింది. క్రూయిజర్ బైక్ మీటీయర్ 350ని 2020, నవంబర్ 06వ తేదీ గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఐషర్ మోటర్స్ భాగమైన మిడ్ సైజ్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఈ కొత్త మీటీరియర్ ను తీసుకొచ్చింది.రూ. 1.76 – 1.91 లక్షల ధరతో విడుదల చేసింది. అద్భుత ఫీచర్లు ఇందులో ఉన్నాయని సంస్థ ప్రకటించింది. మూడు వేరియంట్లలో ఉంది. వెబ్ సైట్ నుంచి బైక్ లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఎన్ ఫీల్డ్ మీటియర్ 350 ఫైర్ బాల్, స్టెల్లార్, సూపర్నోవా మూడు ఎడిషన్లు ఉన్నాయి. అన్ని ఎడిషన్లలో అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లను అమర్చారు.చెన్నై ఎక్స్‌ -షోరూమ్‌లో మీటియర్‌ 350 ఫైర్‌బాల్‌ ధర రూ.1,75,817 నుంచి, స్టెల్లార్‌ ఎడిషన్‌ ధర రూ.1,81,326, సూపర్‌నోవా ఎడిషన్‌ ధర రూ.1,90,536 నుంచి ప్రారంభమవుతుందని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వివరించింది.చెన్నై, యూకేలోని బ్రంటింగ్ థోర్ప్ లోని డిజైనర్లు, ఇంజనీర్లు కొత్త మోడల్ బైక్ ను రూపొందించారని రాయల్ ఎన్ ఫీల్డ్ సీఈఓ వినోద్ కె.దాసరి వెల్లడించారు.
ఈ బైక్ లో సరికొత్త 349 సీసీ, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ బీఎస్ 6 ఇంజిన్ ఉంది.హాలోజెన్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రైజ్డ్ హ్యాండిల్ బార్. Meteor 350 నావిగేషన్. క్లాసిక్ డిజైన్. ఫ్రంట్ టైర్ 19 ఇంచెస్, రియర్ 17 ఇంచెస్. బైక్ నడిపేటప్పుడు సౌకర్యవంతంగా ఉండేవిధంగా సీట్ల ఏర్పాటు. విండ్ స్క్రీన్ ఏర్పాటు. అవసరం లేకపోతే..దీనిని తొలగించుకొనే సౌకర్యం.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *