లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

RPL ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు : ముకేశ్‌ అంబానీ, రిల్‌పై సెబీ భారీ జరిమానా

Published

on

RPL insider trading case : Sebi fines RIL, Mukesh Ambani : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీపై భారీ జరిమానా పడింది. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI) అంబానీపై రూ.15 కోట్ల జరిమానా విధించింది. ముకేశ్‌ అంబానీతో పాటు ఆయన సీఎమ్‌డీగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్ (RIL), మరో రెండు సంస్థలపై కూడా సెబీ జరిమానాలు వేసింది.

2007 నవంబర్‌లో రిలయన్స్‌ పెట్రోలియమ్‌ లిమిటెడ్‌(RPL‌) షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలకు సంబంధించిన కేసులో జరిమానాలను సెబీ విధించింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.25 కోట్లు, ముకేశ్ అంబానీకి రూ.15 కోట్లు, నవీ ముంబై సెజ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.20 కోట్లు, ముంబై సెజ్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్ల మేర జరిమానాలు చెల్లించాలని సెబీ ఆదేశాల్లో పేర్కొంది. సెబీ ఆదేశాలపై రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్పందించలేదు.

ఆర్‌పీఎల్‌లో 4.1% వాటాను విక్రయించాలని 2007, మార్చిలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది. 2017లో నవంబర్‌లో ఆర్‌పీఎల్‌ షేర్ల ట్రేడింగ్‌కు సంబంధించి నగదు, ఫ్యూచర్‌ సెగ్మెంట్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (RPL)లో తన వాటా షేర్ల విక్రయానికి సంబంధించి లావాదేవీల ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అవకతవకలకు పాల్పడిందని సెబీ Adjudicating ఆఫీసర్‌ బి.జె. దిలిప్‌ 95 పేజీల ఆదేశాల్లో పేర్కొన్నారు.