లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

RR vs RCB LIVE IPL 2020: రాజస్థాన్‌పై బెంగళూరు విజయం

Published

on

Picture

రాజస్థాన్‌పై 7వికెట్లు తేడాతో బెంగళూరు విజయం

17/10/2020,7:13PM

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ మెరుపు హాఫ్ సెంచరీ కారణంగా బెంగళూరు జట్టు 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Picture

ఒక్క ఓవర్‌లో 25పరుగులు..

17/10/2020,7:10PM

రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో డివిలియర్స్ చెలరేగి ఆడుతున్నాడు. 19వ ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్ తీరును మార్చేశాడు. ఉనద్కత్ వేసిన ఈ ఓవర్‌లో బెంగళూరు 25పరుగులు చేసింది.

Picture

12బంతుల్లో 35పరుగులు.. బెంగళూరు స్కోరు 143/3

17/10/2020,7:09PM

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – 18 ఓవర్ల తర్వాత 143/3 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడానికి 12 బంతుల్లో 35 పరుగులు అవసరం. డివిలియర్స్ 16 బంతుల్లో 28 పరుగులు, గుర్కిరత్ సింగ్ మన్ 13 బంతుల్లో 11 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో డివిలియర్స్ మెరిస్తే తప్ప బెంగళూరుకు విజయావకాశాలు లేవు.

Picture

రాజస్థాన్ స్కోరు 177/6.. బెంగళూరు టార్గెట్ 178

17/10/2020,6:59PM

దుబాయ్ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌.. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయగా.. రాజస్ధాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(57) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. రాబిన్ ఉతప్ప(41), బట్లర్(24), టెవాటియా (19) కాస్త తోడవ్వడంతో రాజస్థాన్ మంచి స్కోరు చేయగలిగింది. దీంతో బెంగళూరు టార్గెట్ 178పరుగులుగా అయ్యింది. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోర్రీస్ 4 వికెట్లతో చెలరేగగా..చాహల్‌కు 2 వికెట్లు దక్కాయి.

Picture

ఐపిఎల్ 2020 లైవ్, RR vs RCB Score:

17/10/2020,4:27PM

రాజస్థాన్ రాయల్స్ – 13 ఓవర్ల తర్వాత 3వికెట్లు నష్టపోయి 100పరుగుల మార్క్‌ని క్రాస్ చేసింది. ప్రస్తుతం రాజస్థాన్ స్కోరు 103/3. స్టీవ్ స్మిత్ 12 బంతుల్లో 13పరుగులు, జోస్ బట్లర్ 19బంతుల్లో 20పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఇద్దరు బ్యాట్స్ మెన్లు జాగ్రత్తగా నాలుగో వికెట్ నష్టపోకుండా బ్యాటింగ్ చేస్తున్నారు.

Picture

ఉతికారేసిన ఉతప్ప.. 22బాల్స్ 41రన్స్

17/10/2020,4:22PM

ఈ సీజన్‌‌లో పెద్దగా ప్రభావం చూపలేక ఇబ్బందులు పడుతున్న ఉతప్ప ఎట్టకేలకు బెంగళూరుతో మ్యాచ్‌లో తన మార్క్ ఇన్నింగ్స్ చూపించాడు. ఓక సిక్స్, ఏడు ఫోర్లుతో చెలరేగి ఆడిన ఉతప్ప.. చాహల్‌ ఓవర్‌లో భారీ సిక్సర్‌కి ట్రై చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ఉతప్ప స్ట్రైక్ రేట్.. 186.36గా ఉంది.

Picture

వరుసగా రెండు వికెట్లు.. రాజస్థాన్ స్కోరు 76/3

17/10/2020,4:11PM

రాజస్థాన్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌‌గా క్రిస్‌మోరిస్‌ వేసిన ఆరో ఓవర్‌లో బెన్‌స్టోక్స్‌(15) అవుట్ అవగా.. రాజస్థాన్‌ 50 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత దూకుడుగా ఆడుతున్న రాబిన్‌ ఉతప్ప(41) పరుగుల, సంజూ శాంసన్‌(9) ఒకే ఓవర్‌లో పక్క పక్క బంతుల్లో అవుట్ అయ్యారు. చాహల్‌ వేసిన 8వ ఓవర్‌లో తొలి బంతిని భారీ సిక్సర్‌ కొట్టాడు సంజు శాంసన్.. తర్వాత నాలుగో బంతికి ఉతప్ప, ఐదో బంతికి సంజూ శాంసన్‌ క్యాచ్‌లిచ్చి అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్‌స్మిత్‌, జోస్‌బట్లర్‌ ఉన్నారు. రాజస్థాన్ స్కోరు 9ఓవర్లకు 76/3గా ఉంది.

Picture

కాస్త జాగ్రత్తగా.. కొంచెం దూకుడుగా:

17/10/2020,3:57PM

ప్లే ఆఫ్‌ రేసులో ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో కాస్త జాగ్రత్తగా.. కొంచెం దూకుడుగా ఆడుతుంది రాజస్థాన్. ఓపెనర్లుగా ఈసారి బెన్‌స్టోక్స్‌, రాబిన్‌ ఉతప్ప రాగా.. తొలి ఓవర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ వేయగా రెండు పరుగులు.. క్రిస్‌మోరిస్‌ వేసిన రెండో ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే తీసిన రాజస్థాన్.. మూడవ ఓవర్ నుంచి దూకుడుగా ఆడడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన మూడో ఓవర్‌లో, నాల్గవ ఓవర్‌లో రాబిన్‌ ఉతప్ప రెచ్చిపోయాడు. మూడవ ఓవర్‌లో నాలుగు బౌండరీలు బాదిన ఉతప్ప.. నాలుగో ఓవర్‌లో ఒక బౌండరీ, ఒక సిక్సర్‌ బాదాడు. దీంతో 4 ఓవర్లకు రాజస్థాన్‌ స్కోర్‌ 38/0కి చేరింది.

Picture

రాజస్థాన్‌కు కీలకం:

17/10/2020,3:19PM

ఈ ఏడాది ఐపీఎల్‌ను అద్భుతంగా స్టార్ట్ చేసిన రాజస్థాన్ రాయల్స్.. పోనుపోను అనూహ్యంగా వెనకబడి పోతూ ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల విజయాల తర్వాత వరుస పరాజయాలతో గెలిచే మ్యాచ్‌లు కూడా ఓడిపోతూ వస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ఎదుర్కోబోతుండగా.. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితి.

Picture

Rajasthan Royals(Playing 11):

17/10/2020,3:13PM

1.జోస్ బట్లర్ (WK), 2 బెన్ స్టోక్స్, 3 స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), 4. సంజు శాంసన్, 5 రాబిన్ ఉత్తప్ప, 6 రియాన్ పరాగ్, 7 రాహుల్ తెవాటియా, 8 జోఫ్రా ఆర్చర్, 9 శ్రేయాస్ గోపాల్, 10. జయదేవ్ ఉనద్కత్, 11 కార్తీక్ త్యాగి

Picture

Royal Challengers Bangalore(Playing 11):

17/10/2020,3:06PM

1. దేవదత్ పాడికల్, 2 ఆరోన్ ఫించ్, 3 విరాట్ కోహ్లీ (కెప్టెన్), 4 ఎబి డివిలియర్స్ (WK), 5 గుర్కీరత్ సింగ్, 6 క్రిస్ మోరిస్, 7 వాషింగ్టన్ సుందర్, 8 ఇసురు ఉడాన, 9 నవదీప్ సైనీ, 10 షాబాజ్ అహ్మద్ , 11 యుజ్వేంద్ర చాహల్

Picture

టాస్ గెలిచిన రాజస్థాన్.. బెంగళూరు బౌలింగ్!

17/10/2020,2:58PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో ఈ రోజు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని, బెంగళూరును బౌలింగ్‌కు ఆహ్వానించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *