నితిన్ ‘రంగ్ దే’ పునః ప్రారంభం.. ‘బ్లాక్ రోజ్’ ఆగమనం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Rrangde – Black Rose: యువ కథానాయకుడు నితిన్, ‘మహానటి’ కీర్తి సురేష్ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే‘. ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు.


కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్ ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభమయింది. షూటింగ్ కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. నితిన్ తో పాటు ఇతర ప్రధాన తారాగణం ఈరోజు షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది.


ప్రేమ తో కూడిన కుటుంబ కథా చిత్రం ‘రంగ్ దే’. సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.
సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


మిస్ ఇండియా కిరీటాన్ని సాధించి బాలీవుడ్ లో పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన అందాల భామ ఉర్వశి రౌటేలా కథ విన్న వెంటనే ఇంప్రెస్ అయ్యి మొదటి సారి తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించడానికి లేడీ షైలాక్ రూపంలో రాబోతున్న చిత్రం ‘బ్లాక్‌ రోజ్’‌.


పలు సూపర్ హిట్ చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత శ్రీనివాసా చిట్టూరి పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం:4గా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ను బుధవారం విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌.


‘ఏమైంది ఈ వేళ, రచ్చ, బెంగాల్ టైగర్’ చిత్రాలతో మాస్, క్లాస్ ప్రేక్షకులని అలరించిన ప్ర‌ముఖ‌ దర్శకుడు సంపత్ నంది, Shakespeare రచించిన “The Merchant of Venice (ది మర్చంట్ ఆఫ్ వెనిస్)’’ లోని జ్యూయిష్ మనీ లెండర్ షైలాక్ పాత్ర ఆధారంగా ఫిమేల్ ఓరియెంటెడ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని క్రియేట్ చేస్తున్నారు. అలాగే యోగ్యత లేని, విచక్షణ లేని ఆర్థిక లావాదేవీలు మరణానికి సంకేతం” అనే కౌటిల్యుడి అర్ధ శాస్త్రం లోని కాన్సెప్ట్ ని జోడిస్తూ అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రాన్ని తీర్చి దిద్దుతున్నారు.


‘స్నేహ గీతం, దొంగాట’ చిత్రాలకు స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసిన మోహన్ భరద్వాజ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
3వేల కోట్ల టర్నోవర్ ఉన్న ఒక పైనాన్స్ కంపెనీ లో రిలేషన్ షిప్ మేనేజర్ గా పని చేస్తున్న ఒక స్ట్రాంగ్ మోడరన్ వుమన్ వసుధ లైఫ్ లో ఒకరోజు జరిగిన కథే ఈ ‘బ్లాక్ రోజ్’. చిత్ర యూనిట్ మొత్తానికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జ‌రిపి ఒకే షెడ్యూల్‌లో సినిమాని పూర్తిచేయ‌నున్న‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.


Related Tags :

Related Posts :