చెక్ చేసుకోండి : ఆర్ఆర్ బీ ఎన్ టీపీసీ అప్లికేషన్ స్టేటస్ లింక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఆర్ఆర్బీ  ఎన్ టీపీసీ అభ్యర్దులకు కొన్ని నెలల నిరీక్షణకు తెరపడే సమయం దగ్గరకు వచ్చేసింది. పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లును వేగవంతం చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు. దానికంటే ముందుగానే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఆర్ఆర్ బీ నిర్ణయించింది. అంతకంటే ముందుగానే ఎన్‌టీపీసీ అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్ ను చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఆర్ఆర్‌బీ సోమవారం విడుదల చేసింది. అప్లికేషన్ స్టేటస్ లింక్ యాక్టివేట్ చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారా లేదా రిజెక్ట్ చేశారా అన్నది చెక్ చేసుకోవాలి. తమ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసి ఉంటారని పట్టించుకోకపోతే తర్వాత పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది. అందుకోసం అభ్యర్థులందరూ ఆర్ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌ http://rrbonlinereg.co.in/ లో తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి.




అప్లికేషన్ స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి :

> ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అభ్యర్థులు ముందుగా http://rrbonlinereg.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
> హోమ్ పేజీలో Application Status లింక్ క్లిక్ చేయండి. అన్ని ఆర్ఆర్‌బీ రీజియన్స్ జాబితా కనిపిస్తుంది.
> అందులో మీరు ఏ రీజియన్ నుంచి అప్లై చేస్తే ఆ రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి.సికింద్రాబాద్ రీజియన్ అయితే Secunderabad పైన క్లిక్ చేయాలి.



> కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
> సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ పైన మీ అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది.

మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తే మీరు పరీక్ష రాయడానికి అర్హత సాధించినట్టే. ఆ వివరాలను ప్రింట్ తీసుకొని కాపీని భద్రపర్చుకోండి. ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో కారణంతో సహా ఉంటుంది. ఫోటోలు, సంతకం సరిగ్గా లేకపోవడం, అప్లికేషన్ ఫామ్ పూర్తిగా నింపకపోవడం, విద్యార్హతలు లేకపోయినా అప్లై చేయటంలాంటి కారణాల వల్ల దరఖాస్తులు రిజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.




అభ్యర్దులు సెప్టెంబర్ 30,2020 వరకు తమ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పటికే డిసెంబర్ 15,2020 నుంచి పరీక్షలు నిర్వహించాలని రైల్వే బోర్డు ప్రకటించింది. ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ నోటిఫికేషన్ ద్వారా రైల్వేలో 35,000 పైగా ఖాళీలను భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ పోస్టులకు 1,26,30,88 మంది అప్లై చేశారు. వీరిలో దరఖాస్తులు రిజెక్ట్ అయినవారిని మినహాయించి మిగతావారికి పరీక్షల్ని నిర్వహించనుంది ఆర్ఆర్‌బీ తెలిపింది.


Related Posts