లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

భీమ్, రామరాజు కలిశారు.. క్లైమాక్స్ షూటింగ్‌లో ‘ఆర్ఆర్ఆర్’..

Published

on

RRR Climax Shoot: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RRR- రౌద్రం రణం రుధిరం’..

లాక్‌డౌన్ తర్వాత పున:ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ అంతా రాత్రి వేళల్లో, ఎముకలు కొరికే చలిలో షూట్ చేశారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ఫొటో షేర్ చేశారు జక్కన్న.

ఫోటోలో హీరోల్ని చూపించకుండా దేనికోసమైతే కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పోరాటం కొనసాగించారో దాన్ని సాధించడానికి ఆఖరి ప్రయత్నాన్ని మీ కళ్లముందుంచబోతున్నాను అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. ఈ దెబ్బతో అసలు ట్రిపుల్ ఆర్ షూట్ ఎక్కడి వరకొచ్చిందో, ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ఫ్యాన్స్‌కి ఫుల్ క్లారిటీ ఇచ్చారు రాజమౌళి.

ఈ షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ కానుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.. ఈ ఏడాది దసరాకు చిత్రాన్ని విడుదల చేసుందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె. సెంథిల్ కుమార్, ఎడిటింగ్ : ఎ. శ్రీకర్ ప్రసాద్.