యంగ్ టైగర్ గర్జన.. షేక్ అవుతున్న సోషల్ మీడియా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

RRR – Bheem Intro: యంగ్ టైగర్ NTR కొమరం భీమ్, మెగా పవర్ స్టార్ Ram Charan అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటిస్తుండగా.. స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు Rajamouli తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘‘#RRR- రౌద్రం రణం రుధిరం’’.. అక్టోబర్ 22న కొమరం భీమ్ 119వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంట్రో వీడియో విడుదల చేశారు. తారక్ తన క్యారెక్టర్‌ను పరిచయం చేసినట్లు రామ్ చరణ్ కూడా తన వాయిస్ ఓవర్ ద్వారా భీమ్ క్యారెక్టర్‌ను పరిచయం చేశాడు.

RRR : గోండు బెబ్బులిగా తారక్ నటవిశ్వరూపం..


‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి,
నిలబడితే సామ్రాజ్యాలు సాగిల పడతాయి..
వాడి పొగరు.. ఎగిరే జెండా.. వాడి ధైర్యం.. చీకట్లని చీల్చే మండుటెండ..వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్నెం ముద్దు బిడ్డ.. నా తమ్ముడు.. గోండు బెబ్బులి.. కొమరం భీమ్..’’ అంటూ చరణ్, ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేసిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

RRR రికార్డులు స్టార్ట్.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ఎంతంటే!..


తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్‌గా తారక్ వెండితెరపై విజృంభించనున్నాడని హింట్ ఇచ్చిందీ టీజర్.. జక్కన్న టేకింగ్.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్.. సెంథిల్ ఫొటోగ్రఫి&సీజీ, కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్.. ప్రతీది హైలెట్ అయ్యాయి ఈ వీడియోలో..

Related Tags :

Related Posts :