ఆలస్యం లేదు.. అక్టోబర్ నుండి ఆర్ఆర్ఆర్ షూటింగ్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

RRR Shooting Update: లాక్‌డౌన్ కారణంగా గత ఐదు నెలలుగా సినిమా షూటింగులు నిలిచిపోయాయి.. ఉగాది, సమ్మర్‌కు షెడ్యూల్ వేసుకున్న సినిమాలు విడుదల కాలేదు.. దసరా, దీపావళి సంగతి చెప్పక్కర్లేదు.. కట్ చేస్తే సెప్టెంబర్ నుంచి టాలీవుడ్‌లో షూటింగుల సందడి స్టార్ట్ అయింది.. కొంతమేర బ్యాలెన్స్ ఉన్న సినిమాలు పట్టాలెక్కాయి..


అయితే అందరిచూపు ‘ఆర్ఆర్ఆర్’ వైపే ఉంది. జక్కన్న సగం చెక్కి ఆపేసిన ఈ శిల్పాన్ని తిరిగి చెక్కడం ఎప్పుడు మొదలు పెడతాడా అని.. ఎందుకంటే ఈ సినిమా కారణంగా హీరోలు, నిర్మాతలు, దర్శకుల ఫ్యూచర్ ప్రాజెక్టులపై విపరీతంగా ప్రభావం చూపిస్తోంది. ఇక లేట్ చేస్తే ఎన్టీఆర్, చరణ్ తర్వాతి సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. రిలీజ్ సంగతి ఏమోకానీ ఇంకా లేట్ చేస్తే కష్టం అనుకుని రాజమౌళి అండ్ టీమ్ అక్టోబర్ 5 నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకోవడానికి షెడ్యూల్ వేసుకున్నారట.


నారా రోహిత్ నయా లుక్ చూశారా!..


ఈసారి అంతా ప్లాన్ ప్రకారం జరిగితే మార్చి, ఏప్రిల్ నాటికి ఇద్దరు హీరోలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయిపోతుంది. అంటే RRR మీద ఈ అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు దాదాపు ఆరు నెలలపాటు పనిచేయాల్సి ఉంటుంది. షూట్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టేలా ఉందట.. ఒకవేళ రెండూ ఏకకాలంలో చేసినా 2021 వేసవికి విడుదల కష్టమేనంటున్నారు సినీ వర్గాలవారు. ముందు షూటింగ్ పూర్తయితేనే కానీ ఆర్ఆర్ఆర్ విడుదల విషయంలో క్లారిటీ రాదు.


Related Tags :

Related Posts :