అమ్మ బాబోయ్ అలియా.. RRR పరిస్థితి ఏంటి?..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసులో బాలీవుడ్‌లోని నెపోటిజంపై పెద్ద దుమార‌మే రేగుతోంది. ఈ క్ర‌మంలో మ‌హేశ్‌భ‌ట్‌, ఆలియా భ‌ట్ స‌హా సినీ వార‌సుల‌పై నెటిజ‌న్స్ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హేశ్‌భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో సంజ‌య్‌ద‌త్‌, ఆదిత్య‌రాయ్‌క‌పూర్‌, ఆలియాభ‌ట్ న‌టించిన ‘సడక్ 2’ ట్రైలర్ విడుదల చేయగా మోస్ట్ డిస్‌లైక్డ్ ట్రైల‌ర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఇదే నెపోటిజం ఎఫెక్ట్ త‌మ సినిమాపై ప‌డుతుందేమోన‌ని RRR యూనిట్‌లో చిన్న‌టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. ఎన్టీఆర్ అభిమానులైతే Sadak 2 ట్రైలర్ రిలీజ్ చేసినప్పటినుంచి డిస్‌లైక్స్ చూసి ‘అమ్మ బాబోయ్ అలియా ఎంత పనిచేసింది.. ఆర్ఆర్ఆర్ పరిస్థితి ఏంటి’ అంటూ సోషల్ మీడయాలో పెద్ద ఎత్తున డిస్కషన్స్ పెడుతున్నారు.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ చిత్రం క‌రోనా ఎఫెక్ట్ వ‌ల్ల తుది ద‌శ షూటింగ్ ఆగింది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ జోడీగా బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ జోడీ క‌ట్ట‌నుందనే సంగ‌తి తెలిసిందే.

ఇన్ని రోజుల ఆలియా భ‌ట్ త‌మ సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌ని భావించిన ఆర్ఆర్ఆర్ యూనిట్‌కు కొత్త స‌మ‌స్య వ‌చ్చింది. అలియా భట్ ఎఫెక్ట్ కారణంగా సడక్ 2 ట్రైలర్ చెత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తన వల్ల తమ ఆర్ఆర్ఆర్ కి ఎలాంటి సమస్య వస్తుందోనని చిత్ర యూనిట్ ఆందోళనపడుతోందని తెలుస్తోంది.

Related Tags :

Related Posts :