Home » దీపావళి కానుక : పోలీసులకు అదనంగా వెయ్యి రూపాయలు..ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ
Published
1 year agoon
By
madhuదీపావళి కంటే ముందుగానే కర్నాటక ప్రభుత్వం పోలీసులకు కానుక అందించింది. అదనంగా వెయ్యి రూపాయలు భత్యం ప్రకటించింది. అంతేగాకుండా..వారి జీతాల సవరణనను చేసింది. సీనియర్ పోలీసు అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్ రూపొందించిన జీతాల నివేదికను వెంటనే అమలు చేయాలని అక్టోబర్ 19వ తేదీ శనివారం ముఖ్యమంత్రి యడియూరప్ప ఆదేశించారు. కొత్తగా చేరిన పోలీసు కానిస్టేబుళ్ల నెలసరి జీతం రూ. 30 వేల 427 నుంచి రూ. 34 వేల 267 రూపాయలకు పెరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. పోలీసు సిబ్బందికి అదనంగా వెయ్యి రూపాయలు పెంచడం ద్వారా ప్రభుత్వానికి నెలకు అదనంగా రూ. 10 కోట్ల 70 లక్షలు, ఏటా రూ. 128 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.
అంతేగాకుండా ప్రభుత్వ ఉద్యోగుల డీఏను సైతం పెంచారు. 6.50 శాతం నుంచి జీతంలో 11.25 శాతానికి పెంచుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన వేతన సవరణలను 2019, ఆగస్టు 01 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
2019, జులై 01 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీ సిబ్బంది, సహాయక విద్యా సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయాలకు వర్తిస్తుందని తెలిపింది. ఈ పెంపు పెన్షనర్లకు కూడా వర్తిస్తుందని ఉత్తర్వల్లో వెల్లడించింది.
రాఘవేంద్ర ఔరాద్కర్ నాయకత్వంలో జూన్ 2016లో కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికలో సిఫార్సు చేసిన విధంగా పే స్కేల్స్‌ను అప్ గ్రేడ్ చేయడం..పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యత ఇచ్చిందని యడియూరప్ప తెలిపారు.
Read More : దేవుడే కాపాడాడు.. నూకలు ఉన్నాయ్: రెండంతస్తుల మీద నుంచి పడి బతికాడు