వ్యభిచార సైట్లు, పెయిడ్ సర్వీస్ ఫేస్ బుక్, వాట్సప్ గ్రూప్ ల్లో టెక్కీ ఫోటోలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

“Rs 15,000 for “full night” : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూసి ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో నివసించే ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని షాక్ కు గురయ్యింది. పెయిడ్ సెక్స్ సర్వీసు లభించే సోషల్ మీడియా సైట్లు, Facebook, WhatsApp  లలో తన ఫోటోలు పోస్ట్ చేసి కొందరు వ్యక్తులు వ్యభిచారం చేస్తున్నారు. ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసిన తన ఫోటోలను వినియోగించి ..గంటకు రూ.5 వేలు, ఫుల్ నైట్ రూ.15 వేల కు పెయిడ్ సెక్స్ సర్వీసు లభించునని పోస్ట్ చేశారు.

ఇద్దరు పిల్లల తల్లి(40) అయిన ఆ మహిళ ఆ ఫోటోలు చూసి ఖంగు తిన్నారు. మహిళ నచ్చితే నిందితులు సూచించిన వాట్సప్ నెంబర్ లో సంప్రదించమని పేర్కోన్నారు. తన ఫోటోలతో వేరే పేరు పెట్టి నిందితులు సోషల్ మీడియాలో వైరల్ చేసారు. వెంటనే ఆమె తన స్నేహితుడి ద్వారా ఆ నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించింది.అవతలి నుంచి ఫోన్ లిఫ్టు చేసిన వ్యక్తి… మహిళతో లైంగిక సేవలు పొందటానికి, డబ్బులు చెల్లించాల్సిన వివరాలు మాత్రం చెప్పాడు. డబ్బు జమ చేయాల్సిన బ్యాంకు వివరాలు అవి చెప్పాడు. ఈ తతంగం అంతా వాట్సప్ కాల్ లో జరగటం వలన ఆ సంభాషణ రికార్డు చేయటంకానీ…. ఆవ్యక్తిని ట్రాక్ చేయలేక పోయానని బాధిత మహిళ పేర్కోంది.

నోయిడా సెక్టార్ 49 పోలీసుస్టేషన్లో మహిళ ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసుకున్నపోలీసులు 15 రోజుల్లో సంబంధిత ప్రచారం జరుగుతున్న సైట్లను బ్లాక్ చేయించి విచారణ జరుపుతామని మహిళకు హామీ ఇచ్చారు.

Related Posts